Moviesవెంక‌టేష్ నార‌ప్ప సెన్సార్ రిపోర్ట్ ఇదే... సినిమా టాక్ వ‌చ్చేసింది..

వెంక‌టేష్ నార‌ప్ప సెన్సార్ రిపోర్ట్ ఇదే… సినిమా టాక్ వ‌చ్చేసింది..

టాలీవుడ్‌లో సీనియ‌ర్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్ వ‌రుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వ‌స్తున్నాడు. ప్ర‌స్తుతం వెంకీ న‌టిస్తోన్న నార‌ప్ప‌, దృశ్యం 2 సినిమాలు రీమేక్‌. ఈ రెండు సినిమాలు క‌రోనా కార‌ణంగా ఓటీటీలో రిలీజ్ చేసేలా డీల్ క్లోజ్ అయ్యింద‌ని టాక్ ? ఇక వెంకీ కోలీవుడ్ హిట్ మూవీ అసుర‌న్‌కు రీమేక్‌గా చేస్తోన్న నార‌ప్ప రిలీజ్‌కు రెడీ కావ‌డంతో పాటు ఈ రోజు సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా సెన్సార్ వ‌ర్గాల నుంచి యూ / ఏ స‌ర్టిఫికెట్ పొందింది.

ఇంటెన్స్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కిన నార‌ప్ప లో యాక్ష‌న్‌, సెంటిమెంట్ పాళ్లు ఎక్కువుగా ఉన్న‌ట్టు చెపుతున్నారు. సీనియ‌ర్ హీరోయిన్ ప్రియ‌మ‌ణి వెంకీ ప‌క్క‌న జోడీగా న‌టించ‌గా.. మ‌ణిశ‌ర్మ మ్యూజిక్ అందించారు. సురేష్ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై సురేష్ బాబు ఈ సినిమాను నిర్మించారు. ఇక దృశ్యం లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్‌కు సీక్వెల్‌గా వ‌స్తోన్న దృశ్యం 2 సినిమా సైతం షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news