Moviesమా ఎన్నిక‌ల్లో ప్ర‌కాష్‌రాజ్ ఓట‌మే టార్గెట్‌గా ఆ పార్టీ పావులు ?

మా ఎన్నిక‌ల్లో ప్ర‌కాష్‌రాజ్ ఓట‌మే టార్గెట్‌గా ఆ పార్టీ పావులు ?

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల్లో చివ‌ర‌కు రాజ‌కీయ పార్టీలు కూడా ఎంట‌ర్ అయిపోయాయి. ఈ క్ర‌మంలోనే ప్ర‌కాష్ రాజ్‌ను ఓడించేందుకు బీజేపీ రంగంలోకి దిగింద‌న్న ప్ర‌చారం కూడా ఉధృతంగా జ‌రుగుతోంది. నిన్న‌టి వ‌ర‌కు ఆయ‌న‌కు మెగా ఫ్యామిలీ స‌పోర్ట్‌తో పాటు కేసీఆర్, టీఆర్ఎస్ మ‌ద్ద‌తు ఉంద‌న్న ప్ర‌చారం జ‌ర‌గ‌గా.. ఇప్పుడు బీజేపీ ఆయ‌న ఓట‌మే టార్గెట్‌గా పావులు క‌దుపుతోంద‌ని అంటున్నారు. ప్ర‌కాష్ రాజ్ హిందూ వ్య‌తిరేకి అని.. హిందూ భావ‌జాలం అంటే ఆయ‌న‌కు ప‌డ‌ద‌ని.. అందుకే ఆయ‌న్ను ఓడించాల‌ని బీజేపీ వాళ్లు ప్ర‌చారం చేస్తున్న‌ట్టు టాక్ ?

ఇక తెలంగాణ వాదంతో ఈ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్నాన‌ని చెప్పిన సీనియ‌ర్ న‌టుడు సీవీఎల్ న‌ర‌సింహారావు సైతం ఆయ‌న్ను నిల‌దీసిన వైనం చూస్తుంటే మా ఎన్నిక‌ల్లో బీజేపీ కూడా రంగంలోకి దిగిందా ? అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయ‌న్న చ‌ర్చ‌లు మా వ‌ర్గాల్లోనే వినిపిస్తున్నాయి. అస‌లు మా ఎన్నిక‌ల్లో ప‌రాయివాదం, హిందూత్వ వాదం, తెలంగాణ వాదం ఇలా ర‌క‌ర‌కాల వాదాలు పుట్టుకు వ‌చ్చేశాయి.

ఏదేమైనా టీఆర్ఎస్ మ‌ద్ద‌తు ప్ర‌కాష్ రాజ్‌కు అని అంటున్నారు. మంచు విష్ణుకు వైసీపీ మ‌ద్ద‌తు ఉంద‌ని చెపుతున్నారు. బీజేపీ మ‌ద్ద‌తు ఎవ‌రికో తెలియ‌క‌పోయినా ప్ర‌కాష్ రాజ్ ఓట‌మే ఆ పార్టీ టార్గెట్ అంటున్నారు. ఇక బాల‌య్య జీవిత‌కు స‌పోర్ట్ చేస్తే టీడీపీ వాళ్లు జీవిత‌ను స‌పోర్ట్ చేస్తారంటూ ఓ టాక్ మొద‌లైంది. ఏదేమైనా మా లో కులాలు, పార్టీల రొచ్చు మామూలుగా లేదుగా…!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news