Moviesఆ స్టార్ హీరోతో చేతులు కలిపిన రాజుగారు.. వామ్మో పెద్ద స్కెచ్...

ఆ స్టార్ హీరోతో చేతులు కలిపిన రాజుగారు.. వామ్మో పెద్ద స్కెచ్ వేసారుగా..!!

దిల్ రాజు అలియాస్ వి.వెంకట రమణా రెడ్డి..తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాతలలో ఒక్కరు. అల్లు అరవింద్, సురేష్ బాబు లాంటి నిర్మాతలు అప్పుడప్పుడూ సినిమాలు నిర్మిస్తుంటారు. కానీ, దిల్ రాజు మాత్రం అలా కాదు. ఆయన రూటే సపరేటు. ఓ వైపు చిన్న సినిమాలు చేస్తూనే.. మరోవైపు భారీ సినిమాలు కూడా నిర్మిస్తుంటాడు. దిల్ రాజుకు తెలుగులో హీరో కంటే ఎక్కువ ఇమేజ్ ఉందనడంలో ఆశ్చర్యం లేదు. ఈయన బ్యానర్ నుంచి సినిమాలు వస్తున్నాయంటే అది బ్లాక్ బస్టర్ అనే అర్ధం.

ఈ యేడాది ఫిబ్రవరిలో విడుదలైన ‘అల్లరి’ నరేశ్ ‘నాంది’ సినిమా ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘నాంది’ సినిమా ప్రేక్షకుల అభిమానాన్నే కాదు, విమర్శకుల ప్రశంసలూ అందుకుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు నరేశ్ యాక్టింగ్ కి ఫిదా అయిపోయారు.. శభాష్ అన్నారు. న్యాయవ్యవస్థలోని లోపాలనే కాకుండా, ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 211 ద్వారా ఎలాంటి న్యాయం పొందవచ్చో కూడా చెప్పిన చిత్రం ‘నాంది’. ఇప్పుడు ఇదే సినిమాను హిందీలో రీమేక్ చేసే బాధ్యతలను భుజాలపై వేసుకున్నారు టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు.

ఈ సినిమాలో హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగణ్‌ నటిస్తుండడం మరో విశేషం. ఇప్పటికే రాజమౌళి రూపొందిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా RRRలో అజయ్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను పరాగ్ దేశాయ్, దిల్ రాజు, కుల్దీప్ రాథోడ్‌తో కలిసి అజయ్ దేవగణ్ నిర్మిస్తున్నారు. అజయ్ దేవ్ గన్ ఈ సినిమాపై అఫీషియల్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. దిల్ రాజుతో కలిసి హిందీలో ‘నాంది’ని రీమేక్ చేస్తున్నట్టు తెలిపారు. దీంతో ఈ సినిమాపై బీ టౌన్ ఆడియన్స్ దృష్టి పడింది.

‘దిల్’ రాజు ఇప్పటికే బాలీవుడ్ లో బలమైన పునాదిని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఆయన పలు తెలుగు సూపర్ హిట్ చిత్రాలను హిందీలో నిర్మిస్తున్నారు. లైక్ మైండెడ్ ప్రొడ్యూసర్స్ తో కలిసి వరుసగా తెలుగు సినిమాలను రీమేక్ చేస్తున్నారు. ‘జెర్సీ’ ని హిందీలో రీమేక్ చేస్తున్న ‘దిల్’ రాజు.. ‘హిట్’, ‘ఎఫ్ 2’ చిత్రాలను సైతం బాలీవుడ్ లో రీమేక్ చేయబోతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news