మా ఎన్నిక‌లు… చివ‌ర‌కు ఎంత పెద్ద జోక్ అంటే..!

మా ఎన్నిక‌లు మాంచి ర‌స‌వ‌త్త‌రంగా న‌డుస్తున్నాయి. ప్ర‌కాష్ రాజ్ ప్యానెల్‌, మంచు విష్ణు ప్యానెల్స్ తో పాటు నటి హేమ, జీవిత రాజశేఖర్ కూడా పోటీలో ఉన్నట్టు ప్రకటించి మంట రగిల్చారు. మా ఎన్నిక‌ల్లో ఎప్పుడూ లేన‌ట్టుగా చ‌తుర్ముఖ పోటీ నెల‌కొంది. ఇక ఈ న‌లుగురిలో ప్రకాష్ రాజ్ కు మెగా ఫ్యామిలీ అండదండలున్నాయి.. పైగా ఈ రోజు టోట‌ల్ ప్యానెల్ తో క‌లిసి నాగబాబు మ‌ద్ద‌తు ఇవ్వ‌డంతో పాటు చిరంజీవి మ‌ద్ద‌తు కూడా ఉంద‌ని చెప్పారు. సో మెగా కాంపౌండ్‌, మెగా ఫ్యామిలీ టీం అంతా ప్ర‌కాష్ రాజ్‌కే స‌పోర్ట్ చేస్తున్నారు.

ఇక మంచు ఫ్యామిలీకి ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ్వ‌రూ బ‌హిరంగంగా మ‌ద్ద‌తు ఇవ్వ‌లేదు. అయితే మా తాజా మాజీ అధ్య‌క్షుడు న‌రేష్ మ‌ద్ద‌తు ఉంది. ఇక సూప‌ర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ స‌పోర్ట్ కూడా ఉండ‌వ‌చ్చు. మోహన్ బాబు-విష్ణు వెళ్లి కృష్ణను కలవడం వల్ల ఈ మద్దతు రాలేదని.. తెర వెన‌క సీనియ‌ర్ న‌రేష్ చ‌క్రం తిప్ప‌డంతో కృష్ణ స‌పోర్టు దొరికిందంటున్నారు. ఇక మ‌హేష్ కూడా మ‌ద్ద‌తు ఇచ్చే ఛాన్స ఉంది. జీవిత రాజశేఖర్ కు మ‌ద్ద‌తుగా బాలకృష్ణ వెనక నుంచి మ‌ద్ద‌తు ఇస్తున్నారంటున్నారు.

ఇక హేమ రాత్రికి రాత్రే పోటీ ప్ర‌క‌ట‌న చేసింది. ఆమె వెన‌క కూడా కొంద‌రు ప్ర‌ముఖులు ఉంటున్నార‌ని టాక్ ? ఏదేమైనా ఇంత కుళ్లు రాజ‌కీయాలు న‌డుస్తోన్న వేళ .. ఇక‌పై మా ఎన్నిక‌ల్లో ఏకగ్రీవం అనే మాటే మ‌ర్చిపోవ‌చ్చ‌ని.. ఏక‌గ్రీవం అనే మాట పెద్ద జోక్ అని చెప్పాలి.