ఆ క్రికెట‌ర్‌కు కోహ్లీ వార్నింగ్‌… వేటు హింట్ ఇచ్చాశాడే ?

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో భారత్ జట్టు ఓటమిపై దేశ‌వ్యాప్తంగా తీవ్ర విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అయితే జ‌ట్టు వైఫల్యంపై కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఫైన‌ల్లో భార‌త్ పై న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. ఆట ఆరో రోజు బుధ‌వారం భార‌త జ‌ట్టు రెండో ఇన్సింగ్స్ లో కేవ‌లం 170కే ఆల్ అవుట్ అవ్వ‌గా… న్యూజిలాండ్ 139 ప‌రుగుల‌ను రెండు వికెట్లు కోల్పోయి విజ‌యం సాధించి ప్ర‌పంచ టెస్ట్ చాంపియ‌న్ అయ్యింది.

బ్యాట్స్‌మెన్ వైఫల్యంపై కెప్టెన్ కోహ్లీ తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. జ‌ట్టులో ఆట‌గాళ్లు అస‌లు ప‌రుగులు తీయాల‌న్న విష‌య‌మే మ‌ర్చిపోయార‌ని చెప్పాడు. మ్యాచ్ మారుతున్న గ‌మ‌నానికి అనుగుణంగా బ్యాటింగ్ చేస్తూ ప‌రుగులు ఎలా ? రాబ‌ట్టాల‌న్న దానిపై దృష్టి పెట్ట‌డం లేద‌ని కోహ్లీ చెప్పాడు. టెస్ట్ టీం కూడా వ‌న్డే, టీ 20 లాగా బ‌లంగా ఉండాల‌ని తాము కోరుకుంటున్నామ‌ని చెప్పిన కోహ్లీ చతేశ్వర్ పుజారాపై వేటు పడబోతోందని చిన్న హింట్ ఇచ్చేశాడు.

తొలి ఇన్సింగ్స్ లో 35 బంతులు ఆడి గాని పూజారా ఖాతా తెర‌వ‌లేదు. చివ‌ర‌కు 54 బంతులు ఆడి.. కేవ‌లం 8 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. ఇక సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ 80 బంతుల్లో 15 పరుగులే చేశాడు. క్రీజ్ లో నిల‌దొక్కుకున్నాక కూడా పూజారా ప‌రుగులు చేయ‌క‌పోవ‌డంపై కోహ్లీ అసంతృప్తితో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే పూజారాను ప‌క్క‌న పెట్టే ప్ర‌య‌త్నం కూడా జ‌రుగుతోంద‌ని అంటున్నారు. ఇక వైస్ కెప్టెన్ ర‌హానే కూడా నిల‌దొక్కుకోలేద‌ని కోహ్లీ అస‌హ‌నంతో ఉన్నాడ‌ట‌.