ద్యావుడా.. అషు రెడ్డి నోట అలాంటి మాట.. రవి మైండ్ బ్లాక్..!!

అషు రెడ్డి.. పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు డబ్ స్మాష్ వీడియోలతో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసింది. అంతేకాకుండా జూనియర్ సమంత గా గుర్తింపు పొంది వెండితెరపై అవకాశాలు అందుకున్న సెలబ్రిటీ అషు రెడ్డి. ఆ తరువాత బిగ్ బాస్ లో అడుగు పెట్టి మరింత క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఆమె దశ తిరిగింది అనే చెప్పాలి. అంతేకాకుండా బిగ్ బాస్ టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తో లవ్ ట్రాక్ నడుపుతుందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

ఇక కొన్ని టీవీ షోలలో ఈ భామ కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్స్ షోలో..కామెడీ స్టార్ ఎక్స్ ప్రెస్ హరి తో కలిసి తెగ సందడి చేస్తుంది ఈ బిగ్ బాస్ హాట్ బ్యూటి. టిఆర్పీ కోసం వీళ్లిద్దరి మధ్య కూడా ఏదో ఉంది అని భ్రమింపచేస్తున్నారు. అంతేకాకుండా.. బుల్లితెర పై మేల్ యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ రవితో కలిసి హ్యాపీడేస్ అనే షో చేస్తుంది. ఇందులో స్టూడెంట్స్ తో కలిసి బాగా రచ్చ చేస్తుంటారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ షో ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల కాగా.. అందులో బిగ్ బాస్ భామ ఆషు రెడ్డి డబుల్ మీనింగ్ డైలాగులు వైరల్ గా మారాయి.

అందులో ఓ స్టూడెంట్ యాంకర్ రవిని.. మీరు చాలా మంది లేడీ యాంకర్ లతో చేశారు కదా అని ఏదో అడుగుతున్నా సమయంలో వెంటనే అషు రెడ్డి ఎంటర్ అయ్యి.. లేడీ యాంకర్ల తో ఏం చేశాడు అంటూ డబుల్ మీనింగ్ డైలాగ్ వచ్చేలా ప్రశ్నించింది. దీంతో ఒక్కసారిగా అక్కడున్నవారంత షాక్ అయ్యారు. యాంకర్ రవి అయితే కోపం వచ్చినా.. ఏమి చెయ్యలేక కంట్రోల్ చేసుకుని..షో ని కొనసాగించిన్నట్లు ప్రోమోలో తెలుస్తుంది. అక్కడున్న స్టూడెంట్ వేరే అర్థం తో తెగ నవ్వుకున్నారు. ఈ మధ్య కాలంలో డబుల్ మీనింగ్ డైలాగులు అన్ని షోలలో కామన్ అయిపోయాయి. అంతేకాదు అలాంటి డైలాగులు ఉంటేనే షో టీఆర్పిలు బాగా వస్తున్నాయి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామకు మంచి ఫాలోయింగ్ నే ఉంది.