Moviesటాలీవుడ్ హాట్ టాపిక్‌... డైరెక్ట‌ర్ - హీరోయిన్ స‌హ‌జీవ‌నం..!

టాలీవుడ్ హాట్ టాపిక్‌… డైరెక్ట‌ర్ – హీరోయిన్ స‌హ‌జీవ‌నం..!

టాలీవుడ్‌లో ఓ హిట్ డైరెక్ట‌ర్‌.. ఓ హిట్ హీరోయిన్ స‌హ‌జీవ‌నం చేస్తున్నార‌న్న విష‌యం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. ఓ డైరెక్ట‌ర్ ఎంతో క‌ష్ట‌ప‌డి ఓ సినిమా చేశాడు. ఆ సినిమా రిలీజ్ అయ్యేందుకే చాలా ఇబ్బందులు ప‌డాల్సి వ‌చ్చింది. ఎన్నో క‌ష్టాల మ‌ధ్య రిలీజ్ అయిన ఆ సినిమా హిట్ అవ్వ‌డంతో ఆ డైరెక్ట‌ర్‌కు మంచి పేరు వ‌చ్చింది. ఆ సినిమాలో ఓ నార్త్ ఇండియ‌న్ అమ్మాయి హీరోయిన్‌గా న‌టించింది.

ఆ సినిమా షూటింగ్ స‌మ‌యంలోనే వీరి మ‌ధ్య చిగురించిన స్నేహం కాస్తా ప్రేమ‌గా మారి… ఇప్పుడు వారు పీక‌ల్లోతు స‌హ‌జీవ‌నంలో మునిగిపోయే వ‌ర‌కు వెళ్లింద‌ట‌. ఇక స‌ద‌రు హీరోయిన్ త‌ర్వాత మ‌రో సినిమా చేయ‌డంతో పాటు ఆ సినిమాలో చాలా అందంగా క‌నిపించింద‌న్న పేరు కూడా తెచ్చుకుంది. అయినా స‌ద‌రు డైరెక్ట‌ర్ కొత్త సినిమాలో ఆమెను హీరోయిన్‌గా తీసుకోలేదు.

ఆ డైరెక్ట‌ర్ కొత్త సినిమాలో ఏకంగా ముగ్గురు హీరోయిన్లు ఉంటార‌ట‌. అయినా తాను స‌హ‌జీవ‌నం చేసే హీరోయిన్‌ను తీసుకోక‌పోవ‌డంపై కూడా చ‌ర్చ న‌డుస్తోంది. ఇప్పుడు ఈ హీరోయిన్‌, డైరెక్ట‌ర్ స‌హ‌జీవ‌న‌మే ఇండ‌స్ట్రీలో పెద్ద హాట్ టాపిక్‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news