Moviesప్ర‌భాస్ - నాగ్ అశ్విన్ ప్రాజెక్టులో స్టార్ విల‌న్‌.. రేపు ఉద‌యం...

ప్ర‌భాస్ – నాగ్ అశ్విన్ ప్రాజెక్టులో స్టార్ విల‌న్‌.. రేపు ఉద‌యం బిగ్ అనౌన్స్‌మెంట్‌..

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ – మ‌హానటి ఫేం నాగ్ అశ్విన్ కాంబినేష‌న్లో ఓ సినిమా తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. వైజ‌యంతీ మూవీస్ సంస్థ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోన్న ఈ సినిమాపై ఎనౌన్స్‌మెంట్ వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి నేష‌న‌ల్ లెవ‌ల్లో అంచ‌నాలు ఉన్నాయి. ఇప్ప‌టికే హీరోయిన్‌గా బాలీవుడ్ క్రేజీ భామ దీపికా ప‌దుకొనే పేరు కూడా ఖ‌రారు అయ్యింది.

 

ప్ర‌స్తుతం ప్ర‌భాస్ న‌టిస్తోన్న రాధే శ్యామ్ త‌ర్వాత ఈ ప్రాజెక్టు ప‌ట్టాలెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్రాజెక్టు ఎనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి మ‌రో క్రేజీ అనౌన్స్‌మెంట్ రాలేదు. మ‌రోవైపు ఆదిపురుష్ నుంచి ట‌కా ట‌కా అప్‌డేట్స్ వ‌స్తున్నాయి. అయితే ఈ ఎదురు చూపుల‌కు ఈ సినిమా టీం ఫుల్‌స్టాప్ పెట్టేసింది. రేపు ఉదయం 10 గంటలకు పెద్ద ప్రకటన ఉంది అంటూ వైజయంతీ మూవీస్ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది.

 

ఈ పెద్ద ప్ర‌క‌ట‌న ఏంటా ? అన్న స‌స్పెన్స్ ఇప్పుడు అంద‌రిలోనూ నెల‌కొంది. సైన్స్ ఫిక్ష‌న్ క‌థాంశం నేప‌థ్యంలో తెర‌కెక్కే ఈ సినిమాలో ఓ స్టార్ హీరో విల‌న్‌గా న‌టించ‌నున్నాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఆ స్టార్ విల‌న్ పేరు రేపు ప్ర‌క‌టిస్తారని.. అత‌డు ఎవ‌రా ? అని అంద‌రూ చ‌ర్చ‌ల్లో మునిగి తేలుతున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news