Moviesసుధీర్‌ను పెళ్లి చేసుకోక‌పోవ‌డానికి ర‌ష్మి రీజ‌న్ ఇదే..

సుధీర్‌ను పెళ్లి చేసుకోక‌పోవ‌డానికి ర‌ష్మి రీజ‌న్ ఇదే..

బుల్లితెర జోడీల్లో ర‌ష్మికి, సుధీర్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. జ‌బ‌ర్ద‌స్త్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వీళ్లిద్ద‌రు ప్రేమించి పెళ్లి చేసుకుంటార‌ని క‌ప్ప‌టిక‌ప్పుడు కుప్ప‌లు తెప్ప‌లుగా వార్తలు వ‌స్తుంటాయి. అయితే సుడిగాలి సుధీర్‌, రేష్మీ ఈ పుకార్ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ఖండిస్తున్నా జ‌బ‌ర్ద‌స్త్‌, ఢీ ఛాంపియ‌న్స్ ప్రోగ్రామ్స్‌లో ఈ ఇద్ద‌రి కెమిస్ట్రీ చూసిన వాళ్లు మాత్రం వీరిద్ద‌రి ప్రేమ‌, పెళ్లి గురించి ఎప్ప‌టిక‌ప్పుడు సుధీర్ – ర‌ష్మి పెళ్లి చేసుకుంటార‌ని ఏదో ఒక గాసిప్ అల్లేస్తుంటారు.

 

సినిమా రంగంలో ప్ర‌భాస్ – అనుష్క ప్రేమ‌, పెళ్లి గురించి ఎన్ని వార్త‌లు వైర‌ల్ అయ్యాయో బుల్లితెర రంగంలో సుడిగాలి సుధీర్ – రేష్మీ పెళ్లి గురించి అన్ని వార్త‌లు చిలువ‌లు ప‌లువ‌లు అయ్య‌యి. తాజా ప్రోగ్రామ్‌లో రేష్మీ తాను సుధీర్‌ను ఎందుకు పెళ్లి చేసుకోవ‌డం లేదో ఫ‌న్నీగా చెప్పేసింది. ఢీ షోలో సుధీర్ – రేష్మీ పెళ్లి సంభాష‌ణ జ‌రిగింది. తాను సుధీర్‌ను పెళ్లి చేసుకుంటే సుధీర్ బ్ర‌తుకు పావురాలు, ఖ‌ర్చీఫ్ షోల‌తో మ్యాజిక్ షోలు చేసుకోవాల‌ని చెప్పింది.

 

అలాగే మ‌నిద్ద‌రం క‌లిసి మ్యాజిక్ షోలు చేసుకోవాల‌ని చెప్పింది. పెళ్లి చేసుకుంటే ఛాన్సులు త‌గ్గిపోతాయ‌న్న విష‌యం రేష్మి చెప్ప‌క‌నే చెప్పింది. ఏదేమైనా ఈ వ‌య‌స్సులో కూడా రేష్మీ త‌న హాట్ హాట్ అందాల‌తో తెలుగు కుర్ర కారు గుండెల్లో గిలిగింత‌లు పెడుతూ త‌న స‌త్తా చాట‌డం మామూలు విష‌యం కాదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news