Moviesఆ క్రేజీ హీరోపై రేప్ కేసు... ఇండ‌స్ట్రీలో సంచ‌ల‌నం..!

ఆ క్రేజీ హీరోపై రేప్ కేసు… ఇండ‌స్ట్రీలో సంచ‌ల‌నం..!

బాలీవుడ్‌లో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మ‌ర‌ణం త‌ర్వాత వ‌రుస‌గా ఏదో ఒక కాంట్ర‌వ‌ర్సీ రైజ్ అవుతూ వ‌స్తోంది. తాజాగా బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు మిథున్ చ‌క్ర‌వ‌ర్తి కుమారుడు మ‌హాక్ష‌య్‌పై రేప్ కేసు న‌మోదు కావ‌డం ఇండ‌స్ట్రీలో సంచ‌ల‌నంగా మారింది. మ‌హాక్ష‌య్ త‌న‌పై రేప్ చేయ‌డంతో పాటు త‌న‌ను ప్రేమించి మోసం చేశాడంటూ 38 ఏళ్ల ఓషివొరా పోలీస్ కేసు పెట్టింది. 2015 నుంచి మూడేళ్ల పాటు తాను మ‌హాక్ష‌య్‌తో స‌న్నిహిత సంబంధాలు కొన‌సాగించాన‌ని.. తాను అంధేరీలోని అత‌డి ప్లాట్‌కు వెళ్లిన‌ప్పుడు మ‌త్తుమందు క‌లిపిన డ్రింక్ ఇచ్చి త‌న‌పై రేప్ చేశాడ‌ని ఫిర్యాదు చేసింది.

 

తానను మ‌హాక్ష‌య్ పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పాడ‌ని.. అత‌డితో శారీర‌క సంబంధం వ‌ల్ల గ‌ర్భం రావ‌డంతో మ‌ళ్లీ పెళ్లి చేసుకోవాల‌ని కోర‌గా అబార్ష‌న్ చేయించుకోమ‌ని చెప్పాడంటూ ఆమె వాపోయింది. గ‌ర్భ‌విచ్ఛిత్తి కోసం పిల్స్ కూడా ఇచ్చాడ‌ని చెప్పిన ఆమె మ‌హాక్ష‌య్‌తో పాటు అత‌డి త‌ల్లి యోగితా బాలిపై కూడా ముంబై పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.

 

అత‌డి త‌ల్లి కూడా తాను ఫోన్ చేసిన‌ప్పుడు త‌న‌ను బెదిరించింద‌ని ఆమె చెప్పింది. అయితే ఈ కేసులో ఇప్ప‌టికే ఢిల్లీ కోర్టు మ‌హాక్ష‌య్‌, అత‌డి త‌ల్లికి ముంద‌స్తు బెయిల్ ఇవ్వ‌డంతో పాటు నేరం జ‌రిగిన ప్రాంతంలో కేసు వేయాల‌ని ఢిల్లీ కోర్టు చెప్ప‌డంతో ఇప్పుడు ఆమె స్థానికంగా పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news