Moviesకొత్త లుక్‌లో చంపేసిన ఎన్టీఆర్‌...

కొత్త లుక్‌లో చంపేసిన ఎన్టీఆర్‌…

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ స‌రికొత్త లుక్‌లో ద‌ర్శ‌నం ఇచ్చి ఫ్యాన్స్‌కు బిగ్ షాక్ ఇచ్చాడు. అయితే ఇది ఎన్టీఆర్ కొత్త సినిమాకు కాదు.. ఓ యాడ్ కోసం ఎన్టీఆర్ కొత్త లుక్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో పిచ్చ పిచ్చ‌గా వైర‌ల్ అవుతోంది. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమాలో న‌టిస్తున్నాడు. ఏడు నెల‌ల గ్యాప్ త‌ర్వాత ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభ‌మైంది. అయితే హైద‌రాబాద్‌ను భారీ వ‌ర్షాలు ముంచెత్త‌డంతో ఈ సినిమా షూటింగ్ మ‌ళ్లీ తాత్కాలికంగా వాయిదా ప‌డింది.

 

ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమ‌రం భీం లుక్‌లో ద‌ర్శ‌న మిస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ యాడ్ కోసం ఇచ్చిన లుక్‌లో తీక్ష‌ణ‌మైన చూపుల‌తో చాలా స్టైలీష్‌గా ద‌ర్శ‌న మిస్తున్నాడు. చాలా రోజుల త‌ర్వాత త‌మ అభిమాన హీరో అదిరిపోయే లుక్‌తో ద‌ర్శ‌న‌మీయ‌డంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇక ఈ నెల 22నే ఆర్ ఆర్ ఆర్ కొమ‌రం భీం లుక్  రిలీజ్ కానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news