Moviesకార్త‌క‌దీపం హీరో డాక్ట‌ర్ బాబు భార్య ఎవ‌రో తెలుసా...!

కార్త‌క‌దీపం హీరో డాక్ట‌ర్ బాబు భార్య ఎవ‌రో తెలుసా…!

బుల్లితెర‌పై వ‌చ్చే కార్తీక‌దీపం ఎంత సూప‌ర్ పాపుల‌రో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ప్ర‌స్తుతం బిగ్‌బాస్ లాంటి రియాల్టీ షోల‌కే షాక్ ఇచ్చే రేటింగ్‌తో కార్తీక‌దీపం దూసుకుపోతోంది. నాగార్జున లాంటి సీనియ‌ర్ హీరో హోస్ట్‌గా ఉన్నా కూడా వీకెండ్స్‌లో సైతం బిగ్‌బాస్‌కు కార్తీక‌దీపం షాక్ ఇస్తోంది. ఈ సీరియ‌ల్లో హీరోయిన్ ప్రేమి విశ్వ‌నాథ్ ఎంత పాపుల‌ర్ అయ్యిందో.. ఆమెకు భ‌ర్త‌గా నటిస్తోన్న హీరో డాక్ట‌ర్ బాబు సైతం మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. డాక్ట‌ర్ బాబు అలియాస్ నిరుప‌మ్ ఎవ‌రు ? అత‌డి వ్య‌క్తిగ‌త విశేషాలేంటో చూస్తే ఆస‌క్తిగానే అనిపిస్తాయి.

 

 

 

నిరుప‌మ్ కాలేజ్ రోజుల్లోనే న‌ట‌న ప‌ట్ల ఆస‌క్తి పెంచుకున్నాడు. ఏపీలోని విజ‌య‌వాడ‌కు చెందిన నిరుప‌మ్ తండ్రి స్థానికంగా ఓ రేడియో ఛానెల్లో పని చేసేవాడు. అప్ప‌టి నుంచే మ‌నోడికి న‌ట‌న అంటే ఆస‌క్తి ఏర్ప‌డింది. ఆ టైంలోనే స్థానికంగా క‌ల్చ‌ర‌ల్ యాక్టివిటీస్‌లో బాగా నటించేవాడు. ఆ త‌ర్వాత త‌న‌కు తెలిసిన వాళ్ల సాయంతో సీరియ‌ల్స్‌లో న‌టించే అవ‌కాశం ద‌క్కించుకుని.. ఇప్పుడు ఏకంగా బుల్లితెర‌పై సూప‌ర్ పాపుల‌ర్ హీరో అయ్యాడు.

 

 

నిరుప‌మ్ ఈటీవీలో న‌టించిన మంజుల‌తో ప్రేమ‌లో ప‌డ్డాడు. ఈ క్ర‌మంలోనే ఇరువైపులా పెద్ద‌ల‌ను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నాడు. మంజుల కూడా ప‌లు సీరియ‌ల్ల‌లో న‌టించి మంచి పేరు తెచ్చుకుంది. ఈ దంప‌తుల‌కు ప్ర‌స్తుతం ఒక బాబు ఉన్నాడు. ఇక నిరుప‌మ్ సీరియ‌ల్స్‌లో చేసినందుకు ఎపిసోడ్‌కు రు. 25 వేల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ తీసుకుంటాడ‌ట‌. ఇక మంజుల కూడా ఎపిసోడ్‌కు రు. 15 వేలు తీసుకుంటుంద‌ని టాక్‌?

 

 

 

 

నిరుప‌మ్ ప్ర‌స్తుతం బుల్లితెర‌పై సూప‌ర్ పాపుల‌ర్ సీరియ‌ల్ కార్తీక దీపంతో పాటు ప్రేమ‌, హిట్ల‌ర్ సీరియ‌ల్స్‌లో న‌టిస్తున్నాడు. ఇక నిరుప‌మ్ ఎన్ని సీరియ‌ల్స్‌లో చేసినా తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు డాక్ట‌ర్ బాబుగానే తెలుసు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news