Moviesబాల‌య్య‌కు భ‌లే భ‌లే హీరోయిన్ దొరికేసింది..!

బాల‌య్య‌కు భ‌లే భ‌లే హీరోయిన్ దొరికేసింది..!

బాల‌య్య సినిమాకు అన్ని బాగానే సెట్ అవుతాయి. అయితే హీరోయిన్ దొర‌క‌డ‌మే ప్ర‌ధాన స‌మ‌స్య‌. గ‌త కొన్నేళ్లుగా బాల‌య్య సినిమాల్లో స‌రైన హీరోయిన్ సెట్ కావ‌డానికి చాలా టైం తీసుకుంటున్నారు. బోయ‌పాటి సినిమాకు అదే స‌మ‌స్య వ‌చ్చింది. క‌థ‌, క‌థ‌నం, మిగిలిన కేరెక్ట‌ర్లు బోయ‌పాటి త్వ‌ర‌గానే సెట్ చేసుకున్నా హీరోయిన్ విష‌యంలో చాలా రిస్క్ చేశారు. చివ‌ర‌కు ఓ మాంచి హీరోయిన్‌ను సెట్ చేసేశారు. ముందు ప‌లువురు హీరోయిన్ల పేర్లు అనుకున్నారు.

 

 

 

చివ‌ర‌కు కేథ‌రిన్ థెస్రా పేరు కూడా వినిపించింది. ఇప్పుడు మలయాళ హీరోయిన్ ప్రయాగ మార్టిన్ బాల‌య్య‌తో ఆడిపాడ‌బోతోంది. ఆమె తెలుగు వాల్ల‌కు కాస్త ప‌రిచ‌య‌మే. ఉస్తాద్ హోట‌ల్ సినిమాలో ఆమె చిన్న కామియో రోల్ చేసింది. ఇక ఆమె న‌టించిన మిగిలిన సినిమాలు అన్నీ మ‌ళ‌యాళ సినిమాలే. ఇక బోయ‌పాటి ఒక హీరోయిన్‌తో సినిమా తీయ‌డు.

 

ఆయ‌న సినిమా అంటే ఇద్ద‌రు హీరోయిన్లు ఉండాల్సిందే.. ఇప్పుడు బీబీ 3లో కూడా ఇద్ద‌రు బాల‌య్య‌లు ఉండ‌డంతో మ‌రి రెండో హీరోయిన్‌గా ఎవ‌రిని సెట్ చేస్తారో ?  చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news