MoviesR R R టీజ‌ర్ కంటెంట్ లీక్‌..

R R R టీజ‌ర్ కంటెంట్ లీక్‌..

రాజ‌మౌళి ఆర్ ఆర్ ఆర్ ఎట్ట‌కేల‌కు ఏడు నెల‌ల త‌ర్వాత షూటింగ్ పునః ప్రారంభ‌మైనా ప్ర‌స్తుతం హైద‌రాబాద్ వ‌ర్షాల నేప‌థ్యంలో మ‌ళ్లీ తాత్కాలికంగా వాయిదా ప‌డింది. ఇక ఇప్ప‌టికే రామ్‌చ‌ర‌ణ్ రోల్‌కు సంబంధించిన వీడియో బ‌య‌ట‌కు రావ‌డం దానికి అదిరిపోయే రెస్పాన్స్ రావ‌డం తెలిసిందే. ఇక ఇప్పుడు యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ కొమ‌రం భీం పాత్ర కోసం వేచి చూస్తున్నారు. ఇక ఇటీవ‌లే ఆర్ ఆర్ ఆర్ యూనిట్ కూడా ఈ వీడియో వ‌స్తుంద‌ని ప్ర‌క‌ట‌న చేయ‌డంతో ఎన్టీఆర్ అభిమానుల్లో మ‌రింత ఉత్సుక‌త పెరిగింది.

 

ఇక మ‌రో వారం రోజుల్లో రిలీజ్ కావాల్సిన ఎన్టీఆర్ కొమ‌రం భీం టీజ‌ర్ కోస‌మే రాజ‌మౌళి ప్ర‌త్యేకంగా షూటింగ్ చేస్తున్నారు. ఇక ఈ వీడియోలో ఎలాంటి కంటెంట్ ఉంటుందో ఇప్ప‌టికే మ్యాట‌ర్ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో లీక్ అయ్యింది. ఈ టీజ‌ర్లో ఎన్టీఆర్‌ను ప‌లు గెట‌ప్‌ల‌లో చూపించేలా రాజ‌మౌళి టీజ‌ర్ ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. చివ‌ర‌కు త‌ల‌పాగా ఉన్న గెట‌ప్‌తో కొమ‌రం భీం టీజ‌ర్ ముగుస్తుంద‌ని అంటున్నారు.

 

టీజ‌ర్ ఓపెనింగ్ ష‌రాయి – లాల్చీతో ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుంది.. అన్ని గెట‌ప్‌లు కూడా ఫ్యాన్స్‌ను బాగా ఆక‌ట్టుకునేలా క‌ట్ చేశార‌ని అంటున్నారు. ఏద‌మైనా ఎన్టీఆర్ టీజ‌ర్‌పై భారీ అంచ‌నాల‌తో ప్రేక్ష‌కులు వెయిటింగ్‌లో ఉన్నారు. మ‌రి చ‌ర‌ణ్ టీజ‌ర్‌ను మించి ఎన్టీఆర్ టీజ‌ర్ ఉంటుందా ?  లేదా ? అన్న‌ది చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news