News16 ఏళ్ల బాలిక దేశ ప్ర‌ధాని... ప్ర‌పంచ రికార్డు

16 ఏళ్ల బాలిక దేశ ప్ర‌ధాని… ప్ర‌పంచ రికార్డు

ఓ 16 ఏళ్ల బాలిక దేశానికి ప్ర‌ధాని అయ్యి ప్ర‌పంచంలోనే పెద్ద సంచ‌ల‌నం క్రియేట్ చేసింది. ఫిన్లాండ్ దేశానికి 16 ఏళ్ల బాలిక బుధ‌వారం ఉద‌యం ఈ బాధ్య‌త‌లు చేపట్టింది. ఆమె బాధ్య‌త‌లు చేప‌ట్టిన వెంట‌నే కేబినెట్ మంత్రులు, చ‌ట్ట‌స‌భ్యులు, అధికారుల‌తో స‌మావేశం నిర్వ‌హించింది. ఇక అస‌లు విష‌యంలోకి వెళితే ఈ నెల 11న అంత‌ర్జాతీయ బాలిక‌ల దినోత్స‌వం పుర‌స్క‌రించుకుని ఐక్య‌రాజ్య‌స‌మితి గ‌ర్ల్ టేకోవ‌ర్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించింది.

 

ఇందులో భాగంగా ద‌క్షిణ ఫిన్లాండ్‌లో వాక్సే గ్రామానికి చెందిన ఆవా ముర్టో (16) ఒక్క రోజు ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు స్వీక‌రించింది. స్త్రీ-పురుష సమానత్వం అన్న కోణంలో ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌గా.. ఇందులో ప్ర‌ధాని అయిన బాలిక ముర్టోతో పాటు ఫిర్లాండ్ ప్ర‌ధాని స‌నా మారిన్ కూడా కేబినెట్ స‌మావేశంలో పాల్గొన్నారు.

 

అనంత‌రం వారిద్ద‌రు క‌లిసి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ప్ర‌పంచ వ్యాప్తంగా బాలిక‌ల‌కు ఆన్‌లైన్లో కూడా వేధింపులు ఎక్కువ అవుతున్నాయ‌ని.. దీనికి ప‌రిష్కారం చూపాల‌ని కోరారు. ఇక ఫిన్లాండ్‌లో చాలా సంస్థ‌లు సైతం త‌మ బాధ్య‌త‌ల‌ను అన్నింటిని ఒక్క రోజు మ‌హిళ‌ల‌కే అప్ప‌గించాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news