Moviesవీ సినిమా ప్లాప్ అయితే ఆ హీరో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ..!

వీ సినిమా ప్లాప్ అయితే ఆ హీరో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ..!

నాని లేటెస్ట్ మూవీ వి ఈ రోజు అమోజాన్ డిజిట‌ల్ ప్లాట్ ఫామ్‌లో రిలీజ్ అయ్యింది. సినిమాకు యునానిమ‌స్‌గా ప్లాప్ టాక్ వ‌చ్చింది. ఈ మూవీ ప్లాప్ అవ్వ‌డంతో నాని ఫ్యాన్స్‌తో పాటు అటు ఓటీటీపై న‌మ్మ‌కం పెట్టుకున్న సినీ వ‌ర్గాలు కూడా నిరాశ‌లో కూరుకుపోయాయి. ఇక వీరి సంగ‌తి ఇలా ఉంటే ఈ సినిమాకు ప్లాప్ టాక్ వ‌చ్చిన వెంట‌నే టాలీవుడ్‌లో ఉన్న మ‌రో యంగ్ హీరో ఫ్యాన్స్ మాత్రం సోష‌ల్ మీడియాలో వీ ప్లాప్ టాక్‌ను బాగా స్ప్రెడ్ చేస్తున్నారు. ఈ రోజు ఉద‌యం నుంచే వీ ప్లాప్ టాక్ బాగా స్ప్రెడ్ అవుతోంది.

మ‌రి నాని సినిమా ప్లాప్ అయితే స‌ద‌రు హీరో ఫ్యాన్స్ ఎందుకు సంబ‌రాలు చేసుకుంటున్నార‌న్న‌ది గ‌మ‌నిస్తే కొద్ది రోజులుగా నానికి ఆ యువ హీరోకు మ‌ధ్య కోల్డ్‌వార్ న‌డుస్తోంద‌ట‌. ఈ యేడాది స‌ద‌రు యంగ్ హీరో న‌టించిన ఓ సినిమా అట్ట‌ర్ ప్లాప్ అయ్యింది. అప్పుడు నాని ఫ్యాన్స్ మాత్ర‌మే కాదు… ఇత‌ర టాలీవుడ్ స్టార్ హీరోల అభిమానులే కాకుండా, టాప్ ఫ్యామిలీల హీరోల అభిమానులు సైతం సోష‌ల్ మీడియాలో ఆ సినిమా ప్లాప్ టాక్ బాగా స్ప్రెడ్ చేశారు. ఆ హీరో వ‌రుస హిట్ల‌తో టాప్ హీరోల‌కు గ‌ట్టి పోటీ ఇస్తుండ‌డంతో వారంతా స‌ద‌రు హీరో సినిమాలు వ‌స్తున్నాయంటేనే టార్గెట్ చేస్తున్నారు.

ఇక స‌ద‌రు యంగ్ హీరో సినిమాలు వ‌రుస హిట్ అవ్వ‌డంతో నాని ఆ హీరోలా యాట్యిట్యూడ్ ఉన్న మ‌రో హీరోను బాగా ఎంక‌రేజ్ చేశార‌ని ఆ హీరో ఫ్యాన్స్ కాస్త గుస్సాతో ఉన్నారు. అందుకే ఈ రోజు నాని సినిమాకు ప్లాప్ టాక్ వ‌చ్చిన వెంట‌నే వారు నెగిటివ్ బాగా స్ప్రెడ్ చేస్తున్నార‌ని అంటున్నారు. ఏదేమైనా స‌ద‌రు హీరో వ‌ర్సెస్ నాని మ‌ధ్య కోల్డ్‌వార్‌పై ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఒక్క‌టే గుస‌గుస‌లు గుప్పుమంటున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news