Moviesప‌వ‌న్‌క‌ళ్యాణ్ టైటిల్‌తో మాధ‌వీల‌త సినిమా...

ప‌వ‌న్‌క‌ళ్యాణ్ టైటిల్‌తో మాధ‌వీల‌త సినిమా…

ప‌వ‌న్ క‌ళ్యాణ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా బుధ‌వారం అంతా ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు కావాల్సిన‌న్ని అప్‌డేట్లు దొరికాయి. ఒక‌దానిని మించిన మ‌రొక అప్‌డేట్‌తో ప‌వ‌న్ ఫ్యాన్స్ పండ‌గ చేసుకున్నారు. ఉద‌యం వ‌కీల్‌సాబ్ మోష‌న్ పోస్ట‌ర్ ఆ వెంట‌నే క్రిష్ సినిమా ప్రి లుక్‌, ప‌వ‌న్ – సురేంద‌ర్ రెడ్డి సినిమా ప్ర‌క‌ట‌న‌, సాయంత్రం హ‌రీష్ శంక‌ర్ సినిమా లుక్ సైతం రివీల్ అయ్యింది. ఇలా ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కు సోష‌ల్ మీడియాలో ఈ అప్‌డేట్లు ట్రెండ్ అవుతూనే ఉన్నాయి.

Pawan Kalyan Satyagrahi Motion Poster Released By Actress Madhavi Latha |  Tollywood Nagar - YouTube

ఇన్ని అప్‌డేట్స్ మ‌ధ్య నిన్న ఓ ఆస‌క్తిక‌ర‌మైన అప్‌డేట్ కూడా వ‌చ్చింది. మాధవీలత ప్రధానపాత్రలో రూపొందుతోన్న ఒక సినిమా ‘సత్యాగ్రహి’. కృష్ణచైతన్య దర్శకత్వంలో శ్రీ భవిత క్రియేషన్స్ పతాకంపై గంగారెడ్డి నిర్మిస్తున్నారు. ప‌వ‌న్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఈ సినిమాలో మాధ‌వీల‌త ఫ‌స్ట్ లుక్ రివీల్ చేశారు. ఆమె ఓ మైక్ ప‌ట్టుకుని ఉంటే.. ఆ వెన‌క బ్యాక్‌గ్రౌండ్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉన్నారు. ఈ పోస్ట‌ర్‌పై మా నాయ‌కుడు ఓట్లు అడ‌గ‌మ‌ని చెప్పాడు… కొన‌మ‌ని కాదు అన్న క్యాప్ష‌న్ రాశారు.

Satyagrahi Motion Poster | Madhavi Latha Satyagrahi Motion Poster |Pawan  Kalyan | Media Culture - YouTube

ఈ లుక్ ప‌వ‌న్ ఫ్యాన్స్‌ను, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌ను బాగా ఆక‌ట్టుకుంది. ఇక గ‌తంలోనే స‌త్యాగ్రాహి టైటిల్‌తో ప‌వ‌న్ ఓ సినిమా చేయాల‌నుకున్నా కుద‌ర్లేదు. పోస్ట‌ర్ రిలీజ్ చేసి ఆపేశారు. ఇప్పుడు అదే టైటిల్‌తో మాధ‌వీల‌త సినిమా చేస్తోంది. ఏదేమైనా ఈ పోస్ట‌ర్ కూడా నిన్న ప‌వ‌న్ అభిమానుల‌ను, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. ప‌వ‌న్ ఆశ‌యాలు, సిద్ధాంతాలు ప్ర‌జ‌ల్లోకి తీసుక వెళ్లేలా ఈ సినిమా ఉంటుంద‌ని ద‌ర్శ‌కుడు చెపుతున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news