Moviesబిగ్‌బాస్ 4... ఫ‌స్ట్ వీక్‌లోనే స్టార్‌మాకు అదిరిపోయే టీఆర్పీ రేటింగ్‌

బిగ్‌బాస్ 4… ఫ‌స్ట్ వీక్‌లోనే స్టార్‌మాకు అదిరిపోయే టీఆర్పీ రేటింగ్‌

తెలుగు బిగ్‌బాస్ 4వ సీజ‌న్‌కు రంగం సిద్ధ‌మైంది. మ‌రో నాలుగు రోజుల్లో బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను టీవీల‌కు క‌ట్టిప‌డేయ‌నున్న ఈ రియాల్టీ షోకు కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే షోలో పాల్గొనే 16 మంది కంటెస్టెంట్లు లిస్ట్ ఫైన‌ల్ అయ్యింది. ఈ క్ర‌మంలోనే నిర్వాహ‌కులు కోవిడ్ నేప‌థ్యంలో ప్ర‌త్యేక జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. ఇక సుడిగాడు హీరోయిన్ మోనాల్ గ‌జ్జ‌ర్‌ను చివ‌రి నిమిషంలో క‌న్‌ఫార్మ్ చేసిన‌ట్టు తెలుస్తోంది.

Nagarjuna Akkineni-hosted Bigg Boss Telugu 4 likely to get postponed? -  Times of India

ఇదిలా ఉంటే బిగ్‌బాస్ 4వ సీజ‌న్ తొలి వారంలోనే భారీ టీఆర్పీ రేటింగ్ సొంతం చేసుకోనుంద‌ని నివేదిక‌లు వ‌చ్చాయి. ట్విట్ట‌ర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్ అన్న తేడా లేకుండా ఎక్క‌డ చూసినా బిగ్‌బాస్ మోత మోగిపోతోంది. బిగ్ బాస్ హ్యాష్ ట్యాగ్తో ప్ర‌చారం అవుతోన్న వార్తలు ప్ర‌జ‌ల్లో ఉత్సాహం నింపుతున్నాయి. ఇక సోష‌ల్ మీడియాలో బిగ్‌బాస్ పోస్టుల‌కు కూడా అదిరిపోయే రీచ్ రావ‌డంతో పాటు లైకులు, కామెంట్లు వ‌స్తున్నాయి.

Bigg Boss Telugu Vote Season 4 (Online Voting) Contestants | Star Maa

ఇక ఇలాంటి రియాల్టీ షోల‌ను యువ‌త ఎంతో ఉత్సాహంతో చూస్తారు. ఇక ఫ్యామిలీస్ కూడా బిగ్‌బాస్ పట్ల ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌తో ఉంటాయి. ఇప్పుడు లాక్‌డౌన్ నేప‌థ్యంలో మామూలుగానే టెలివిజ‌న్ షోల‌కు టీఆర్పీ రేటింగ్ 100 శాతం పెరిగింద‌ని టీఆర్పీ నివేదిక‌లు చెపుతున్నాయి. ఇక ఇప్పుడు ఇళ్ల‌ల్లోనే ఉంటోన్న వారంద‌రు బిగ్‌బాస్ చూస్తే తొలి వారంలోనే అదిరిపోయే టీఆర్పీ రేటింగ్ రావ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది. ఇక షోల టెలివిజ‌న్ స్టార్స్‌, టిక్ టాక్ స్టార్స్‌, మాజీ హీరోయిన్లు ఉండ‌డంతో గ్లామ‌ర్‌కు కొద‌వ‌లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news