Gossipsబ‌న్నీ డెడ్‌లైన్‌తో ఆయ‌న‌లో ఒక్క‌టే టెన్ష‌న్‌...!

బ‌న్నీ డెడ్‌లైన్‌తో ఆయ‌న‌లో ఒక్క‌టే టెన్ష‌న్‌…!

సంక్రాంతికి వ‌చ్చిన అల వైకుంఠ‌పుర‌ములో సినిమా సూప‌ర్‌డూప‌ర్ హిట్ కావ‌డంతో అల్లు అర్జున్ రేంజ్ ఒక్క‌సారిగా పెరిగిపోయింది. ఈ సినిమా వ‌సూళ్ల‌తో మామూలుగా దుమ్ము రేప‌లేదు. ఇక ప్ర‌స్తుతం బ‌న్నీ క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కే పుష్ప సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఇప్ప‌టికేఏ షూటింగ్ స్టార్ట్ అయినా క‌రోనా నేప‌థ్యంలో వాయిదాల మీద వాయిదాలు ప‌డుతోంది. అయితే ఇప్పుడు పుష్ప షూటింగ్ ఫినిష్ చేసే విష‌యంలో బ‌న్నీ ద‌ర్శ‌కుడు సుకుమార్‌కు డెడ్ లైన్ పెట్టేశాడంటున్నారు.

ఎట్టి ప‌రిస్థితుల్లోనూ వ‌చ్చే సంక్రాంతికి సినిమా కంప్లీట్ అయిపోవాల‌ని.. సంక్రాంతి రేసులో సినిమా ఉండేలా ప్లాన్ చేయాల‌ని సుకుమార్‌కు కండీష‌న్ పెట్టేశాడ‌ట‌. కావాలంటే ఎక్కువ స‌మ‌యం షూటింగ్ చేయ‌డానికి అయినా తాను రెడీగా ఉంటాన‌ని.. షెడ్యూల్స్ అన్ని ప‌క్కా ప్లానింగ్‌తో టైమింగ్‌కు అయిపోవాల‌ని బ‌న్నీ చెప్పేశాడ‌ట‌. ఇక ఎక్కువ కాలం కూడా ఇప్పుడు తాను మెయింటైన్ చేస్తోన్న గెట‌ప్‌ను ఉంచ‌లేన‌ని కూడా సుక్కుతో చెప్పేశాడ‌ని పుష్ప టీం వ‌ర్గాల ద్వారా మ్యాట‌ర్ లీక్ అయ్యింది.

ఇప్పటికే పుష్ప కోసం బన్నీ గడ్డం, జుట్టు పెంచి చాలా స్లిమ్ అయిన సంగతి తెలిసిందే. బ‌న్నీ కండీష‌న్లు ఎలా ఉన్నా సుకుమార్ మాత్రం క్వాలిటీ విష‌యంలో రాజీప‌డ‌డు. అందుకే సుక్కు సినిమాలు వ‌చ్చేందుకు ఏకంగా సంవ‌త్స‌రాల టైం ప‌డుతుంది. సుకుమార్ డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌యం అయ్యాక 14 ఏళ్ల‌లో కేవ‌లం ఏడు సినిమాలు మాత్ర‌మే చేశాడు. మ‌రి పుష్ప లాంటి పాన్ ఇండియా సినిమా విష‌యంలో బ‌న్నీ మాట ఎంత వ‌ర‌కు వింటాడో ?  చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news