GossipsR R R నుంచి ఆలియాభ‌ట్ అవుట్‌... రంగంలోకి ఆమె..!

R R R నుంచి ఆలియాభ‌ట్ అవుట్‌… రంగంలోకి ఆమె..!

దర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌. రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తోన్న ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే 70 శాతం కంప్లీట్ అయ్యింది. ఈ సినిమాను వ‌చ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాల‌ని అనుకున్నా కూడా క‌రోనా నేప‌థ్యంలో అది జ‌రిగేలా లేదు. ఇక ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ తిరిగి ఎప్పుడు ప్రారంభ‌మ‌వుతుందో ?  కూడా తెలియ‌ని ప‌రిస్థితి. ఈ సినిమాలో చెర్రీ న‌టిస్తోన్న అల్లూరి సీతారామ‌రాజు రోల్ ప‌క్క‌న ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టీమ‌ణి ఆలియాభ‌ట్‌ను తీసుకున్నారు.

ఆమె పేరు ఖ‌రారైన‌ప్ప‌టి నుంచి ఆర్ ఆర్ ఆర్ షూటింగ్‌కు ఏదో ఒక అవాంత‌రాయం ఎదుర‌వుతూనే వ‌స్తోంది. ఇక సుశాంత్ మ‌ర‌ణం త‌ర్వాత ఆలియాపై భారీగా నెగిటివిటీ కూడా పెరిగిపోయింది. దీంతో ఆర్ ఆర్ ఆర్ టీం కూడా ఆందోళ‌న‌లో ఉంద‌ని తెలుస్తోంది. ఇక ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ వాయిదా ప‌డ‌డంతో పాటు అటు బాలీవుడ్‌లో ఆలియాకు క‌మిట్‌మెంట్లు కూడా ఎక్కువ ఉండ‌డంతో ఇప్పుడు ఆలియా కూడా ఈ సినిమా నుంచి త‌ప్పుకుంటాన‌ని చెప్ప‌గా రాజ‌మౌళి కూడా ఓకే చెప్పాడ‌ని అంటున్నారు.

ఇక ఇప్పుడు ఆలియా ప్లేసులోకి ప్రియాంక చోప్రా ఎంట్రీ ఇచ్చిందంటున్నారు. ఆమె గ‌తంలో చెర్రీతో క‌లిసి జంజీర్ ( తెలుగులో తుఫాన్‌) సినిమాలో న‌టించింది. రాజ‌మౌళికి చెర్రీయే ప్రియాంక పేరును సూచించాడ‌ట‌. అన్నీ కుదిరి ప్రియాంక‌తో సంప్ర‌దింపులు పూర్త‌య్యి ఆమె ఓకే చెపితే మ‌రోసారి ప్రియాంక – చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌ను తెర‌మీద చూడ‌బోతున్నాం..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news