Newsబిగ్ బ్రేకింగ్‌: శ్రీశైలం ప్ర‌మాదంలో బాధితుల చివ‌రి క్ష‌ణాల వీడియో...

బిగ్ బ్రేకింగ్‌: శ్రీశైలం ప్ర‌మాదంలో బాధితుల చివ‌రి క్ష‌ణాల వీడియో లీక్‌..

శ్రీశైలం ఎడ‌మ‌గ‌ట్టు ప‌వ‌ర్ హౌస్‌లో జ‌రిగిన ప్ర‌మాదంలో 9 మంది మృతి చెంద‌డం యావ‌త్ తెలుగు ప్ర‌జ‌ల‌ను తీవ్రంగా క‌లిచి వేసింది. ప్ర‌మాదం జ‌రిగి వారు చ‌నిపోయే ముందు ఏం జ‌రిగింద‌నే దానిపై ఓ వీడియో లీక్ అయ్యింది. ఈ ప్ర‌మాదం జ‌రిగి వారు పొగ‌లో అలుముకునేముందు ఏఈ సుంద‌ర్ అంత‌కు ముందే భార్య‌తో మాట్లాడారు. ఆ త‌ర్వాత ప్ర‌మాదం జ‌రిగి పొగ మొత్తం అలుముకోవ‌డంతో మోహ‌న్‌తో మ‌న ప‌ని అయిపోయింద‌ని మాట్లాడారు.

మోహ‌న్ అయిపోయింది.. క‌ష్టం.. మ‌న ప‌ని పూర్త‌య్యింది… ఇక ప్రాణాల‌పై ఆశలు వ‌దులుకో.. ఇక మ‌న బ‌త‌కం.. పొగ మొత్తం అలుముకుంది… అంటూ మోహ‌న్‌ను సుంద‌ర్ హెచ్చ‌రించాడు. మ‌ర‌ణానికి ముందు వారు తీవ్ర భ‌యంతో వ‌ణికిపోయినట్టు వారి మాట‌లు.. వారి భ‌యం ద్వారా తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news