Gossipsఆదిపురుష్‌లో శివ‌గామి రోల్ ఫిక్స్ అయ్యింది..

ఆదిపురుష్‌లో శివ‌గామి రోల్ ఫిక్స్ అయ్యింది..

యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ వ‌రుస పెట్టి సినిమాల‌ను ప‌ట్టాలెక్కిస్తున్నాడు. సాహో త‌ర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ప్ర‌భాస్ ప్ర‌స్తుతం రాధే శ్యామ్ సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంట‌నే నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో వైజ‌యంతీ మూవీస్ నిర్మించే సినిమాకు ఓకే చెప్పాడు. ఆ వెంట‌నే బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆదిపురుష్ సినిమాలో కూడా ప్రభాస్ నటించనున్న విషయం తెలిసిందే. శ్రీరాముడి జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కే ఈ సినిమా భారీ హంగుల‌తో రు. 500 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్క‌నున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

Ramya Krishnan Height, Weight, Age, Husband, Family, Biography ...

ఇత‌ర భాష‌ల న‌టీన‌టుల‌తో పాటు హాలీవుడ్ టెక్నీషీయిన్ల‌తో ఈ సినిమా రూపొంద‌నుంది. ఇక ఆదిపురుష్‌లో లేటెస్ట్ అప్‌డేట్ ప్ర‌కారం బాహుబ‌లి శివ‌గామి ఓ కీల‌క పాత్ర‌లో న‌టించ‌నుంద‌ని తెలుస్తోంది. బాహుబలిలో శివగామి పాత్రలో అదరగొట్టిన రమ్యకృష్ణ ఇప్పుడు జాతీయ స్థాయిలో పాపుల‌ర్ న‌టీమ‌ణి అయ్యింది. ఇప్పుడు ఆదిపురుష్‌లో కూడా ఓ కీల‌క పాత్ర‌కు ఆమె అయితేనే న్యాయం చేస్తుంద‌ని భావించి ఆమెనే ఎంపిక చేశార‌ని తెలుస్తోంది.

 

ప్ర‌స్తుతం జాతీయ మీడియాలో కూడా ఈ సినిమా గురించి… ఈ సినిమాలో పాత్ర‌ధారుల గురించి భారీ చ‌ర్చ న‌డుస్తోంది. ఇక ర‌మ్య‌కృష్ణ రోల్ గురించి కూడా సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం స్టార్ట్ అయ్యింది. దీనిపై త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news