Gossipsశ‌ర్వానంద్ పెళ్లికొడుకు అవుతున్నాడోచ్‌.... అమ్మాయి ఎవ‌రంటే...!

శ‌ర్వానంద్ పెళ్లికొడుకు అవుతున్నాడోచ్‌…. అమ్మాయి ఎవ‌రంటే…!

ప్ర‌పంచానికి 2020 క‌లిసి రాని కాలం అవుతున్నా టాలీవుడ్ హీరోల‌కు మాత్రం బాగా క‌లిసొస్తోంది. ఈ యేడాది టాలీవుడ్‌కు చెందిన ప‌లువురు వ‌రుస పెట్టి పెళ్లి పీఠ‌లు ఎక్కేస్తున్నారు. టాలీవుడ్ మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచిల‌ర్‌గా ఉన్న ద‌గ్గుబాటి రాని ఎట్ట‌కేల‌కు ఇటీవ‌ల ఓ ఇంటి వాడు అయ్యాడు. ఇక హీరోలు నిఖిల్ సిద్ధార్థ్‌, నితిన్‌, సాహో డైరెక్ట‌ర్‌, త‌దిత‌రులు కూడా పెళ్లి చేసేసుకున్నారు. ఇక అంత‌కు ముందే నిర్మాత దిల్ రాజు సైతం త‌న రెండో వివాహం చేసుకున్నాడు.

sarvanand Archives - Chai Pakodi

ఇక మెగా ఆడ‌ప‌డుచు, నాగ‌బాబు కుమార్తె, హీరోయిన్ నిహారిక కూడా నిశ్చితార్థం పూర్తి చేసుకుని త్వ‌ర‌లో పెళ్లి పీఠ‌లు ఎక్క‌డానికి సిద్ధ‌మైంది. ఇక మూడు రోజుల క్రిత‌మే కృష్ణా అండ్ హిజ్ లీల హీరోయిన్ షాలిని రెండు రోజుల క్రితం త‌మిళ‌ ద‌ర్శ‌కుడు మ‌నోజ్‌ను మ‌నువాడింది. ఇప్పుడు ఈ లిస్టులో చేరేందుకు రెడీ అవుతున్నాడు యువ హీరో శ‌ర్వానంద్‌. తాజాగా శర్వానంద్ కూడా ఓ ఇంటి వాడు కాబోతున్నాడ‌న్న వార్త వైర‌ల్ అవుతోంది.

 

శ‌ర్వా ‌త‌న చిన్న‌నాటి ఫ్రెండ్‌, మ‌హిళా పారిశ్రామిక‌వేత్తతో శ‌ర్వానంద్ ప్రేమ‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. వీరి ప్రేమ‌కు పెద్ద‌లు కూడా గ్రీన్‌సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో త్వ‌ర‌లోనే ముహూర్తం పెట్టి పెళ్లి చేసేయాల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చేశార‌ట‌. శ‌ర్వానంద్ కూడా పెళ్లిపై క్లారిటీ ఇస్తే మ‌రిన్ని విష‌యాలు తెలియ‌నున్నాయి. ఏదేమైనా ఈ యేడాది సినిమాల ప‌రంగా హీరోల‌కు క‌లిసి రాక‌పోయినా పెళ్లిళ్ల ప‌రంగా బాగా ల‌క్కీ ఇయ‌ర్‌గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news