మ‌హేష్ – న‌మ్ర‌త పెళ్లి వెన‌క ఆ ఇద్ద‌రిదే కీ రోల్‌… ఆ ద‌ర్శ‌కుడు, ఆ హీరో ఎవ‌రంటే..?

టాలీవుడ్‌లో ఘట్ట‌మ‌నేని ఫ్యామిలీ వార‌సుడిగా ఎంట్రీ ఇచ్చిన మ‌హేష్‌బాబు ఆ త‌ర్వాత అన‌తి కాలంలోనే సూప‌ర్‌స్టార్ అయ్యాడు. త‌న తండ్రి నుంచి వ‌చ్చిన బ‌ల‌మైన వార‌స‌త్వాన్ని ఇక్క‌డ కంటిన్యూ చేస్తూ ఈ త‌రం స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక మ‌హేష్ బాబు మాజీ మిస్ ఇండియా న‌మ్ర‌తా శిరోద్క‌ర్‌ను వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. 2000లో బి.గోపాల్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన వంశీ సినిమాలో మ‌హేష్‌, న‌మ్ర‌త జంట‌గా న‌టించారు. ఈ సినిమా కోసం ఆస్ట్రేలియాలో 40 రోజుల పాటు ప్రేమ స‌న్నివేశాలు చిత్రీక‌రించారు.

 

ఈ షూటింగ్ టైంల‌నే న‌మ్ర‌త‌, మ‌హేష్ ప్రేమ‌లో ప‌డ‌డం చివ‌ర‌కు 2005లో పెళ్లి చేసుకోవ‌డం జ‌రిగింది. ఈ ప్రేమ స‌న్నివేశాలు షూట్ చేస్తోన్న స‌మ‌యంలో వీరి మ‌ధ్య రీల్ ప్రేమ కాస్తా సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యే టైంకు రియ‌ల్ ప్రేమ‌గా మారిపోయింద‌ట‌. వీరి మ‌ధ్య ఉన్న ప్రేమానుబంధం గురించి తెలిసిన ఓ ద‌ర్శ‌కుడు మీరు పెళ్లిచేసుకోండ‌ని స‌ల‌హా ఇచ్చార‌ట‌. ఈ ద‌ర్శ‌కుడితో పాటు మ‌హేష్‌కు బాగా బెస్ట్ ఫ్రెండ్ అయిన మ‌రో హీరో కూడా మ‌హేష్‌తో న‌మ్ర‌త‌ను పెళ్లి చేసుకోమ‌ని సూచించ‌డంతో పాటు ఇరు కుటుంబాల పెద్ద‌ల‌ను ఒప్పించాడ‌ట‌.

 

మ‌హేష్ ఈ విష‌యాన్ని ప‌దే ప‌దే గుర్తు చేసుకుంటాడ‌ని కూడా ఆయ‌న గురించి బాగా తెలిసిన వారు చెపుతూ ఉంటారు. అయితే త‌న పెళ్లికి ఎంతో ప్రోత్సాహం ఇచ్చిన ఆ ద‌ర్శ‌కుడు, స‌ద‌రు హీరో ఎవ‌ర‌న్న‌ది మాత్రం బ‌య‌ట‌కు వెల్ల‌డించ‌లేదు. ఏదేమైనా మ‌హేష్ ఇప్పుడు న‌మ్ర‌త‌ను పెళ్లి చేసుకుని ఎంచ‌క్కా… ఇద్ద‌రు ముద్దుగుమ్మ‌ల్లాంటి పిల్ల‌లు సితార‌, గౌత‌మ్‌తో పాటు భార్య న‌మ్ర‌త‌తో ఎంచ‌క్కా ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు.

Leave a comment