Moviesకాబోయే భార్య‌తో స‌హ‌జీవ‌నం స్టార్ట్ చేసిన రాహుల్ రామ‌కృష్ణ‌

కాబోయే భార్య‌తో స‌హ‌జీవ‌నం స్టార్ట్ చేసిన రాహుల్ రామ‌కృష్ణ‌

సింగ‌ర్ నుంచి స్టార్ క‌మెడియ‌న్ రేంజ్‌కు ఎదిగాడు రాహుల్ రామ‌కృష్ణ‌. అర్జున్‌రెడ్డి సినిమాతో వెండితెర‌పైకి వ‌చ్చిన రాహుల్ రామ‌కృష్ణ‌కు ఆ సినిమా మంచి గుర్తింపు తీసుకువ‌చ్చింది. ఆ త‌ర్వాత వ‌రుస‌గా భరత్ అనే నేను, గీత గోవిందం, అలవైకుంఠపురములో, బ్రోచేవారెవరురా వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో న‌టించాడు. ప్ర‌స్తుతం ఆర్ ఆర్ ఆర్‌తో పాటు విరాట‌ప‌ర్వం సినిమాలో కూడా కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. త‌న తాజా ఇంట‌ర్వ్యూలో రాహుల్ తాను ఓ అమ్మాయితో ప్రేమ‌లో ఉన్నాన‌ని.. ఆ అమ్మాయితో స‌హ‌జీన‌వం కూడా చేస్తున్నాన‌ని చెప్పాడు.

 

కొద్ది రోజుల‌ క్రితం తాను పెళ్లి చేసుకోబోతున్నట్టు ట్విట్టర్ ద్వారా అఫీషియల్‌గా ప్రకటించిన రాహుల్ బిందు అనే అమ్మాయిని తాను ప్రేమ వివాహం చేసుకోబోతున్న‌ట్టు చెప్పాడు. ఇక క‌రోనా వ‌ల్ల త‌న పెళ్లి ప్ర‌స్తుతానికి వాయిదా ప‌డింద‌ని.. నేను బిందును సోష‌ల్ మీడియాలోనే క‌లిశాన‌ని.. అర్జున్‌రెడ్డి సినిమా చూసి ఆమె చేసిన మెసేజ్ న‌చ్చ‌డంతో మ‌న‌సులు ఒక్క‌టై చివ‌ర‌కు ప్రేమించుకుని.. పెళ్లికి రెడీ అవుతున్నామ‌ని చెప్పాడు.

మ‌రో ట్విస్ట్ ఏంటంటే ఆమె మెసేజ్ చేశాక ఆమె కోసం ఫ్లాట్ కోసం వెతుకుతుంటే మా ఇంటి పక్కన ఫ్లాట్స్ ఉన్నాయి వచ్చి చూడమని చెప్పింది. ఆమెను స‌ర్‌ప్రైజ్ చేయాల‌ని ఆమె అడ్ర‌స్ క‌నుక్కుని వెళ్లి మ‌రీ త‌లుపు కొట్టాన‌ని… అయితే అప్ప‌టికే ఆమె ఆఫీస్‌కు వెళ్లిపోయింద‌ని రాహుల్ చెప్పాడు. ఆ త‌ర్వాత మా ప్రేమ విష‌యాన్ని ఇంట్లో వాళ్ల‌కు చెప్ప‌గా వారు ఓకే చెప్పార‌ని.. ప్ర‌స్తుతానికి మ్యారేజ్ చేసుకోక‌పోయినా క‌లిసే ఉంటున్నామ‌ని రాహుల్ చెప్పాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news