Gossipsతార‌క్ వెంట ప‌డుతోన్న ఆ న‌లుగురు టాప్ ద‌ర్శ‌కులు వీళ్లే...!

తార‌క్ వెంట ప‌డుతోన్న ఆ న‌లుగురు టాప్ ద‌ర్శ‌కులు వీళ్లే…!

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ తార‌క్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తోన్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంట‌నే మ‌నోడు మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించే సినిమాలో న‌టించ‌నున్నాడు. ఆర్ ఆర్ ఆర్, త్రివిక్ర‌మ్ సినిమా రెండూ వ‌చ్చే యేడాదే రిలీజ్ కానున్నాయి. ఈ రెండు సినిమాల త‌ర్వాత కేజీఎఫ్ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించే సినిమాకు దాదాపు క‌మిట్ అయ్యాడ‌నే అంటున్నారు.

ఇక ఈ మూడు సినిమాలు లైన్లో ఉండ‌గానే తార‌క్ కోసం మ‌రో ఇద్ద‌రు టాప్ ద‌ర్శ‌కులు వెంట ప‌డుతున్నార‌ని అంటున్నారు. ఇప్పుడు ఈ విష‌యం ఇండ‌స్ట్రీలో బిగ్ హాట్ టాపిక్‌గా మారింది. వారిలో కొరటాల శివ మరియు సుకుమార్ ల పేర్లు ఎక్కువగా ఇప్పుడు వినిపిస్తున్నాయి. వీరిలో కొర‌టాల ఇప్ప‌టికే తార‌క్ తో జ‌న‌తా గ్యారేజ్ సినిమా తీశాడు. ఇక సుక్కు – తార‌క్ కాంబోలో నాన్న‌కు ప్రేమ‌తో సినిమా వ‌చ్చి సూప‌ర్ హిట్ అయ్యింది.

ఇలా తార‌క్‌కు రెండు హిట్లు ఇచ్చిన ద‌ర్శ‌కులే ఇప్పుడు మ‌రోసారి తార‌క్‌తో సినిమా చేసేందుకు ఆస‌క్తితో ఉన్నారు. ఏదేమైనా వ‌చ్చే యేడాది కానీ ఈ ప్రాజెక్టుల‌పై క్లారిటీ వ‌చ్చేలా లేదు. ప్ర‌స్తుతం కొర‌టా చిరుతో ఆచార్య సినిమా, సుక్కు బ‌న్నీతో పుష్ప సినిమాలు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news