ఆంటీలా నన్ను దారుణంగా.. డైరక్టర్ ను నమ్మితే నట్టేట ముంచాడట..!

ఆరెక్స్ 100 సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న అందాల భామ పాయల్ రాజ్ ఫుత్ ఆ ఒక్క సినిమాతోనే ఒక ఐదారు సినిమాల క్రేజ్ తెచ్చుకుంది. ఆరెక్స్ 100 సినిమాలో అమ్మడి అందాల ప్రదర్శనకు ఆడియెన్స్ అంతా ఫిదా అయ్యారు. అందుకే అమ్మడికి భారీ పాపులారిటీ వచ్చింది. అయితే ఆ సినిమా తర్వాత ఆలాంటి హాట్ ఇమేజ్ ఉన్న పాత్రలే వచ్చాయి. వాటిని చేయక తప్పలేదు. ఇక లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో వెంకీ మామ సినిమాలో వెంకటేష్ కు జోడీగా చేసింది పాయల్.

ఆ సినిమాలో పాయల్ పెళ్లి కానీ ముదురు అమ్మాయిగా నటించింది. ఆ సినిమాలో ఆమె పాత్రకు పర్ఫెక్ట్ గా సూట్ అయింది. అయితే సినిమా వచ్చింది హిట్ అయ్యింది ఇప్పుడు ఆ సినిమాను చూసిన తన సన్నహితులు ఆమెకు ఆంటీలా మారిపోయావని చెప్పారట. వారు చెప్పారని అంటుందో లేక కావాలని అంటుందో కానీ వెంకీ మామ డైరక్టర్ నన్ను మోసం చేశాడని.. పాత్ర ఒక విధంగా చెప్పి మరోలా తీశాడని అంటుంది. అయినా అంతా అయ్యాక ఇప్పుడు డైరక్టర్ ను అని ఏం లాభం చెప్పండి. సినిమా కూడా సక్సెస్ అయింది ఆ క్రేజ్ తో మరో ఆఫర్ రాబట్టుకోవాలి కానీ ఇలా మాట్లాడకూడదు.

పాయల్ కు స్వతహాగా వచ్చిందో లేక ఎవరైనా అంటే వచ్చిందో కానీ ఆంటీగా చేసినా ఆమె హాట్ నెస్ కుర్రాళ్ళు ఎంజాయ్ చేశారు. దానికి అమ్మడు అంతగా బాధపడాల్సిన అవసరం లేదని చెప్పొచ్చు.