సూపర్ స్టార్ రజినికాంత్ కాళ్ళు పట్టుకున్న వైల్డ్ హోస్ట్..!

మ్యాన్ వర్సెస్ వైల్డ్ షూటింగ్ మొన్నామధ్య జరిగిన విషయం తెలిసిందే. రజిని ఈ షూటింగ్ లో గాయాలపాలైన మళ్ళీ కోలుకుని మరి వైల్డ్ హోస్ట్ తో సాహసాలు చేశాడు. డిస్కవరీ ఛానెల్ లో వైల్డ్ షో హోస్ట్ గా చేస్తున్న బేర్ గ్రిల్స్ తో కర్ణాటకలోని బందిపుర టైగర్ రిజర్వ్ లో షూటింగ్ జరిగింది. ఆ పక్కనే రజిని సినిమా షూటింగ్ జరుగుతుండగా డిస్కవరీ షూటింగ్ అని తెలిసి రజిని బేర్ గ్రిల్స్ తో చేతులు కలిపాడు.

రజిని దొరికాడు కదా అని ఆయనతో గుట్టలు ఎక్కించడం.. వంతెనపై నడిపించడం.. కొండలెక్కించడం ఇలా చాలా సాహసాలు చేయించాడు బేర్ గ్రిల్స్. ప్రపంచంలో ఎంతో మంది సూపర్ స్టార్స్ తో పనిచేసిన అనుభవం ఉన్నా రజినీతో వర్క్ ఎక్స్ పీరియన్స్ చాలా ప్రత్యేకం అంటూ చెప్పుకొచ్చాడు బేర్ గ్రిల్స్. సూపర్ స్టార్ సూపర్ ఎనర్జీ చూసి బేర్ గ్రిల్స్ సైతం ఆశ్చర్యపడ్డాడు. బస్ కండక్టర్ నుండి సూపర్ స్టార్ గా రజిని ఎదిగిన తీరుని గురించి తెలుసుకున్న బేర్ గ్రిల్స్ రజినీకి హ్యాట్సాఫ్ చేశారు.