బాలీవుడ్ సింగర్ కు కరోనా.. వాళ్ళంతా వణుకుతున్నారు..!

బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ కు కరోనా పాజిటివ్ రావడం ఇప్పుడు కేంద్రంలో కొత్త టెన్షన్ ఏర్పడేలా చేసింది. ఆమె ఇటీవల ఓ పెళ్లి వేడుకకు పాల్గొనడం అందులో కేంద్ర మంత్రులు కూడా పాల్గొన్నారని తెలుస్తుంది. దాదాపు 100 మంది దాకా ముఖ్య రాజకీయ నేతలు ఆమె వెళ్లిన పెళ్లి వేడుకకు వెళ్లారట. అంతేకాదు ఆ రాజకీయ నేతలు ఆ తర్వాత రాష్ట్రపతి భావం లో జరిగిన చర్చల్లో కూడా పాల్గొన్నారట. బాలీవుడ్ స్టార్స్ కూడా కనికాకు కరోనా పాజిటివ్ వచ్చిందన్న విషయం తెలియక ఆమెతో కలిసి తిరిగారట. వీళ్ళనందరు ఇప్పుడు తమకి కరోనా వస్తుందా అన్న భయాందోళనలో ఉన్నారు.

ప్రస్తుతం వీళ్లంతా ఇంటి దగ్గరే ఉంటూ సెల్ఫ్ క్వారెంటైన్ లో ఉండాలని సూచించారు. వీళ్ళలో ఎవరికైనా కరోనా తీవ్రత ఎక్కువైతే మాత్రం విషయం చాలా పెద్దదిగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే కరోనా పాజిటివ్ వచ్చిందన్న విషయాన్ని లెట్ గా చెప్పినందుకు కనికా మీద కేసు ఫైల్ చేశారు. కరోనా తనకు రావడమే కాకుండా దాని నిర్లక్ష్యం చేసి రాజకీయ, సినీ పరిశ్రమల్లో కలకలం రేపుతోంది.

Leave a comment