అల వైకుంఠపురములో.. బన్నీ కెరీర్ బిగ్గెస్ట్ హిట్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం ‘అల వైకుంఠపురములో’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి అన్ని చోట్లా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పటికే పలు కొత్త రికార్డులు సృష్టించిన ఈ సినిమా తాజాగా బన్నీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌కు ఓవర్సీస్‌లో ఎలాంటి ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే.

పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాకు ఓవర్సీస్ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమాను చూసేందుకు వారు థియేటర్ల వద్ద క్యూ కడుతున్నారు. దీంతో ఈ సినిమా ఏకంగా 2 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరింది. ఈ అరుదైన ఫీట్‌ను అందుకోవడం త్రివిక్రమ్‌కు ఇది నాలుగోసారి కావడం విశేషం. అయితే ఓవర్సీస్‌లో ఈ ఫీట్ సాధించడం బన్నీకి మొదటిసారి.

త్రివిక్రమ్ మార్క్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాతో బన్నీ కెరీర్‌లోనే బిగ్గిస్ట్ హిట్‌ను అందుకున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు థమన్ సంగీతం అదనపు బలంగా మారడంతో ఈ సినిమా మరిన్ని రికార్డులను బద్దలుకొట్టేందుకు దూసుకుపోతుంది.

Leave a comment