ఆర్ఆర్ఆర్.. ఆ ఒక్కటి చాలంటున్న చిత్ర యూనిట్

ప్రస్తుతం టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్ వచ్చినా తప్పకుండా ఫాలో అవుతున్నారు ప్రేక్షకులు. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్నారు.

కాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కోసం గత కొంత కాలంగా ఎదురుచూస్తు్న్న ప్రేక్షకులకు ప్రతిసారి నిరాశే ఎదురవుతుంది. జనవరి 1న న్యూ ఇయర్ కానుకగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారేమో అని అనుకున్న ప్రేక్షకులు, కనీసం సంక్రాంతికైనా రిలీజ్ చేస్తారని చూశారు. కానీ రాజమౌళి వారికి ఎదురుచూపులే మిగిల్చాడు. ఇకపోతే ఈ సినిమాలో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్సులు ఉన్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ సీన్‌ను అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు చిత్ర యూనిట్.

ఒక్క క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్‌ కోసమే దాదాపు రూ.150 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. భారీ సెట్టింగులతో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్ కానున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను జూలై 30కి బదులుగా అక్టోబర్ నెలలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు.

Leave a comment