Gossipsమెగా కూతురుపై ట్రోలింగ్..!

మెగా కూతురుపై ట్రోలింగ్..!

మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి మొదటి సారిగా మోగాబ్రదర్ కూతురు కొణిదెల నిహారిక హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయ్యింది. అయితే హీరోయిన్ గా నటించిన ఆమె సినిమాలో పెద్దగా హిట్ కావడం లేదు. అయినా తన కెరీర్ కొనసాగించే ప్రయత్నాలు చేస్తుంది నిహారిక. ఓ వైపు షార్ట్ ఫిలిమ్స్..మరోవైపు వెండి తెరపై తన సత్తా చాటుకుంటుంది. ఇక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోయిన్ కావడంతో ఎక్కువ గ్లామర్ డోస్ ఉండదని తెలిసిందే.

తాజాగా ఈ అమ్మడు చేసిన పోస్ట్ కి దిమ్మతిరిగేలా ఉంది. పెద్దగా గ్లామర్ షో చేయని ఈ బ్యూటీ తాజాగా ఓ ఫోటో షేర్ చేసింది. వైజాగ్ బీచ్ లో ఎంజాయ్ చేస్తూ ఉన్న సమయంలో ఓ ఫోటో తీయించుకుంది నీహారిక. ఆమె తల్లి స్వయంగా ఆ ఫోటో తీసింది. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘బీచ్ లో సరదాగా గడిపిన రోజు కంటే బెస్ట్ మరొకటి లేదు’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోలో నీహారిక లాంగ్ షర్ట్ ధరించింది. అంతే ఈ ఫోటోపై ఒక్కసారే ట్రోలింగ్స్ మొదలయ్యాయి.

మీరు మెగా ఫ్యామిలీలో పుట్టారు.. కొంచెం గౌరవడంగా ఉండడం నేర్చుకోండి’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు ఏకంగా ‘ప్యాంట్ మర్చిపోయావా.. నీహారిక’ అంటూ ప్రశ్నిస్తున్నారు. నీకు ఎంత హిట్స్ రాకుంటే మాత్రం ఇలా పరువు తీసేలా స్కిన్ షో చేయాలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ వెబ్ సిరీస్ లో నటించడానికి సిద్ధమవుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news