‘ డియ‌ర్ కామ్రేడ్ ‘ ప్రీమియ‌ర్ షో రికార్డ్ క‌లెక్ష‌న్స్‌.

టాలీవుడ్ సెన్షేష‌న‌ల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ స‌త్తా ఏంటో డియ‌ర్ కామ్రేడ్ ప్రీమియ‌ర్ వ‌సూళ్లు చెప్పేశాయి. సౌత్‌లో నాలుగు భాష‌ల్లో భారీ హైప్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా అమెరికాలో తొలి రోజు ప్రీమియ‌ర్ల ద్వారా రికార్డు స్థాయిలో వ‌సూళ్లు కొల్ల‌గొట్టింది. ఈ సినిమాతో ఈ యేడాది సంక్రాంతికి వ‌చ్చిన మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ విన‌య విధేయ రామ వ‌సూళ్లు కూడా క్రాస్ అయ్యాయి.

కేవలం ఈ ప్రీమియర్స్ ద్వారా డియర్ కామ్రేడ్ 2.5 లక్షల డాలర్స్ వసూలు చేసింది. ఈ మొత్తం రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ చిత్ర ప్రీమియర్స్ వసూళ్ల కంటే కూడా ఎక్కువ. ఈ యేడాది అమెరికాలో రిలీజ్ అయిన తెలుగు సినిమాల ప్రీమియ‌ర్ వ‌సూళ్లు చూస్తే మహర్షి 5.16 లక్షల డాలర్లు – ఎన్టీఆర్ కథానాయకుడు 4.83 లక్షల డాలర్లు – ఎఫ్2, 2.59 లక్షల డాలర్ల వసూళ్లు కొల్ల‌గొట్టాయి.

పై సినిమాలు మాత్ర‌మే డియ‌ర్ కామ్రేడ్ కంటే ముందున్నాయి. పెద్ద హీరోల‌కే సాధ్యం కాని రేంజ్‌లో విజ‌య్ సినిమాకు అక్క‌డ ప్రీమియ‌ర్ వ‌సూళ్లు రావ‌డంతో ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు సైతం షాక్ అవుతున్నాయి. ఇక అర్జున్ కెరీర్‌లోనే బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా ఉన్న అర్జున్ రెడ్డి సినిమా ప్రీమియర్ వసూళ్ల కంటే కూడా డియర్ కామ్రేడ్ కంటే ముందున్నాయి. సినిమాకు పాజిటివ్ బ‌జ్ వ‌చ్చినా నెరేష‌న్ స్లోగా ఉంద‌న్న కంప్లెంట్ వ‌స్తోంది. మ‌రి విజ‌య్ ఛ‌రిష్మాతో ఈ సినిమా బాక్సాఫీస్ ర‌న్ ఎలా ? ఉంటుందో ? చూడాలి.

Leave a comment