నారా రోహిత్ క్యూట్ రొమాన్స్ ‘ గోవింద చ‌రితం ‘ టీజ‌ర్‌

నారా రోహిత్ రెండేళ్ల క్రితం వ‌ర‌కు యేడాదికి ఏడెనిమిది సినిమాలు చేసుకుంటూ వ‌చ్చాడు. మంచి క‌థ‌లే ఎంచుకున్నా రోహిత్ సినిమాలు ఎందుకో గాని ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ కాలేదు. 2016-17 సంవ‌త్స‌రాల్లో అయితే నెలకు లేదా రెండు నెల‌ల‌కు ఓ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేసేవాడు.

వ‌రుస ప్లాపుల‌తో కాస్త గ్యాప్ తీసుకున్న రోహిత్ ఇప్పుడు మ‌ళ్లీ వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నాడు. గోవిందచిత్రం సినిమాతో త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. వేగ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా రోహిత్‌కు 18వ సినిమా. రోహిత్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఈ సినిమా టీజ‌ర్ రిలీజ్ అయ్యింది.

40 సెక‌న్ల పాటు ఉన్న టీజ‌ర్‌లో నారా రోహిత్ – హీరోయిన్ల మ‌ధ్య క్యూట్ రొమాన్స్ షాట్లు మాత్ర‌మే చూపించారు. టీజ‌ర్‌కు బ్యూటిఫుల్ ఫొటోగ్ర‌పీతో పాటు నేప‌థ్య సంగీతం హైలెట్ అయ్యాయి. అంద‌మైన ల‌వ్‌స్టోరీగా ఈ సినిమా తెర‌కెక్క‌నుంద‌ని టీజ‌ర్ చెప్పేస్తోంది.

Leave a comment