Gossipsబాత్ రూం టవెల్ లో హాట్ బ్యూటీ.. ఇలా చేస్తే అవకాశాలు...

బాత్ రూం టవెల్ లో హాట్ బ్యూటీ.. ఇలా చేస్తే అవకాశాలు వస్తాయా..!

కొంతమంది హీరోయిన్స్ కేవలం తమ క్రేజ్ ను మాత్రమే క్యాష్ చేసుకోవాలని చూస్తారు. అలాంటి వారు ఎన్నాళ్లు ఇండస్ట్రీలో ఉంటారో తెలియదు కాని ఉన్నంత కాలం గ్లామర్ షోతో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తారు. అంతేకాదు ఛాన్సులు రావట్లేదన్న టైంలో ఇంకాస్త రెచ్చిపోయి మరి తమ అందాలను గుమ్మరిస్తారు. లేటెస్ట్ గా ఓ హీరోయిన్ ఏకంగా బాత్ టవల్ తో సెమీ న్యూడ్ పిక్స్ తో ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేస్తుంది.

తెలుగులో సినిమాకో కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇస్తుంది. లేటెస్ట్ గా బేవర్స్ సినిమాతొ హర్షిత అనే మోడల్ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. ఇక్కడ ఆడియెన్స్ ను బుట్టలో వేసుకునే ఫార్ములా తెలిసిన అమ్మడు ఏకంగా బాత్ టవల్ తో దిగిన పిక్స్ తో సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇంతకుముందే ఖయ్యూం భాయ్, సత్యా గ్యాంగ్ సినిమాల్లో నటించిన హర్షిత ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ లీడ్ రోల్ లో వస్తున్న బేవర్స్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమా ప్రమోషన్స్ ఎలాగున్న ఆమె అందాలకు మాత్రం ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. బాత్ రూం ఫోటో షూట్స్ కు భలే క్రేజ్ ఉంటుంది. సరైన ఛాన్స్ రావాలే కాని తాను ఎలాంటి సినిమాలకైనా రెడీ అని చెబుతుంది అమ్మడు. చూస్తుంటే హర్షిత తెలుగులో మరిన్ని ఛాన్సులు తెచ్చుకునేలా ఉంది. బేవర్స్ సినిమా బాగా ఆడితే అమ్మడి దశ తిరిగినట్టే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news