జబర్ధస్త్ కమెడియన్ వినోద్ పై హత్యాయత్నం..!

తెలుగు లో వస్తున్న జబర్ధస్త్ కామెడీ షో ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇందులో నటించే నటులు సైతం సొసైటీలో మంచి గౌరవాన్ని సంపాదించుకున్నారు. ఇతర టీవి ప్రోగ్రామ్స్ లో ఛాన్సులు దక్కించుకోవడమే కాదు వెండి తెరపై కూడా తమ సత్తా చాటుతున్నారు. జబర్ధస్త్ షోలో కొంతమంది మగవాళ్లు లేడీ గెటప్స్ తో అలరిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో శాంతి స్వరూప్, వినోద్ లు ఎన్నో స్కిట్స్ లో లేడీ గెటప్ తో వస్తున్నారు.
gdsgadgs
తాజాగా జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్ అయిన వినోద్ పై తాజాగా హత్యాయత్నం జరిగింది. హైదరాబాద్ లోని కాచిగూడ దగ్గర కొందరు వినోద్ పై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై వినోద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వినోద్ చెప్పిన వివరాల ప్రకారం తన ఇంటి ఓనరే తనపై హత్యకు ప్రయత్నించాడని వినోద్ చెబుతున్నాడు.

ఈ ఘటనలో వినోద్ కంటి భాగంలో తీవ్ర గాయమైంది. గతంలో కూడా వినోద్ పలు వివాదాస్పద వార్తల్లో నిలిచారు. బలవంతంగా కుటుంబ సభ్యులు పెళ్లి చేయడానికి ప్రయత్నించగా వినోద్ చేతిని కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాజాగా అతడిపై హత్యాయత్నం జరగడం హాట్ టాపిక్ గా మారింది. అయితే తన ఇంటి ఓనర్ ఎందుకు హత్యా ప్రయత్నం చేయాల్సి వచ్చిందో వివరాలు తెలియరాలేదు.

Attachments area

Leave a comment