Gossipsఎన్టీఆర్ ను బీట్ చేయగలడా..?

ఎన్టీఆర్ ను బీట్ చేయగలడా..?

కొన్నాళ్లుగా ఆడియెన్స్ అంతా ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 మొదలైంది. కింగ్ నాగార్జున హోస్ట్ గా 15 మంది కంటెస్టంట్స్ తో బిగ్ బాస్ సీజన్ 3 మొదలైంది. నాగార్జున టెరిఫిక్ ఎంట్రీతో షో మొదలవగా కంటెస్టంట్స్ అందరిని పిలిచి హౌజ్ లోకి పంపిస్తూ నాగార్జున హుశారైన హోస్టింగ్ చేశాడు. ఆల్రెడీ మీలో ఎవరు కోటేశ్వరుడు రియాలిటీ షో హోస్ట్ చేసి సూపర్ సక్సెస్ అందుకున్న నాగార్జున ఈసారి ఈ బిగ్ బాస్ హోస్ట్ గా మారాడు.

నాగార్జున కన్నా ఎన్.టి.ఆర్ కాస్త జోవియల్ గా చేశాడన్నది ఇన్నర్ టాక్. మొదటి ఎపిసోడ్ కదా కాస్త అలానే ఉంటుంది. రాను రాను నాగార్జున కూడా ఇరగదీసేస్తాడు అంటున్నారు అక్కినేని ఫ్యాన్స్. ఏది ఏమైనా తారక్ రేంజ్ లో ఎంట్రీ లేదు అన్నది కొందరి వాదన. మధ్యలో సీజన్ 2 నాని హోస్ట్ గా చేసినా అది కూడా సోసోగానే అనిపించింది. ఎన్.టి.ఆర్ రేంజ్ కు నాగార్జున చేస్తాడా.. ఆయన్ను మించి చేస్తాడా అన్నది చూడాలి.

నందమూరి ఫ్యాన్స్ మాత్రం బిగ్ బాస్ హోస్ట్ అంటే ఎన్.టి.ఆర్ తర్వాతే ఎవరైనా అన్నట్టుగా చెప్పుకుంటున్నారు. అసలైతే బిగ్ బాస్ సీజన్ 3 హోస్ట్ గా తారక్ ను అడిగినా తను ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ లో బిజీగా ఉండటం వల్ల చేయలేనని చెప్పాడు. ఫైనల్ గా కింగ్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. మరి నాగ్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 ఎలాంటి మలుపులతో ముందుకు సాగుతుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news