Moviesస్వీటీ పై మోజు పడ్డ యువ హీరో..!

స్వీటీ పై మోజు పడ్డ యువ హీరో..!

స్వీటీ అనుష్క కేవలం గ్లామర్ పాత్రలకే కాదు లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఆమె సూపర్ క్రేజ్ తెచ్చిపెట్టింది. అరుంధతి తర్వాత అరుంధతి ముందు అనుష్క కెరియర్ చాలా వ్యత్సాహం ఉంది. ఆ తర్వాత ఆమెతోనే రుద్రమదేవి, భాగమతి వంటి సినిమాలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటిన బాహుబలిలో కూడా అనుష్క నటించిన విషయం తెలిసిందే. ఇక అనుష్క అంటే పడి చచ్చే ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. అయితే ఇండస్ట్రీలో కూడా అనుష్క ఫ్యాన్స్ ఉన్నారు.

ముఖ్యంగా ఓ యంగ్ హీరో అయితే అనుష్క పేరు చెబితే చాలు మెలికలు తిరుగుతాడట. అనుష్క అంటే పడి చచ్చిపోయే ఆ హీరో ఎవరో కాదు నాగ శౌర్య అని తెలుస్తుంది. అనుష్క అన్నా ఆమె నటన అన్నా చాలా ఇష్టంట అతనికి. మనోడు హీరో కాకముందు నుండి అనుష్క అంటే ఇష్టమట. కేవలం హీరోగానే కాదు ఓ సగటు అభిమానిగా అనుష్కను అభిమానిస్తాడట నాగ శౌర్య.

అయితే తనకు ఇప్పటివరకు అనుష్కతో నటించే ఛాన్స్ రాలేదని ఆ ఛాన్స్ వస్తే అది ఎలాంటి పాత్ర అయినా సరే తప్పకుండా చేస్తానని అంటున్నాడు. స్వీటీ అనుష్క కోసం పడిచస్తున్న నాగ శౌర్య నిజంగా ఆమెతో నటించే ఛాన్స్ వస్తే ఎలా ఉంటుందో చూడాలి. ప్రస్తుతం నాగ శౌర్య సమంత ఓ బేబీలో నటిస్తున్నాడు. తన సొంత ప్రొడక్షన్ లో కూడా ఓ సినిమా చేస్తున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news