Moviesఖైది టీజర్.. కార్తి క్రేజీ అటెంప్ట్..!

ఖైది టీజర్.. కార్తి క్రేజీ అటెంప్ట్..!

కోలీవుడ్ హీరో కార్తి మరోసారి ఒర మాస్ లుక్ తో వస్తున్న సినిమా ఖైది. లోకేష్ కనగరాజ్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో కార్తి ఖైది లుక్ లో కనిపిస్తున్నాడు. ఊర మాస్ లుక్ తో మాస్ ఆడియెన్స్ కు కావాల్సిన అంశాలన్ని ఈ సినిమాలో ఉన్నట్టు తెలుస్తుంది. నిమిషం ఉన్న టీజర్ లోనే ఇంత విధ్వంసం సృష్టించిన కార్తి ఫుల్ సినిమా మాస్ ఆడియెన్స్ కు ఫుల్ ఫీస్ట్ అందించేలా ఉన్నాడు.

డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ లో వస్తున్న ఖైది సినిమా టీజర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజైంది. ఈ టీజర్ చూసిన ఆడియెన్స్ కార్తి క్రేజీ అటెంప్ట్స్ కు భలే రెస్పాన్స్ ఇస్తున్నారు. కార్తి నరైన్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు సామ్ సిఎస్ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రభు, ప్రకాశ్ బాబు, వివేక్ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ ఇంప్రెస్ చేసింది.

దేవ్ ఫ్లాప్ తో డీలా పడ్డ కార్తి ఈసారి ఖైదితో కుమ్మేసేలా ఉన్నాడు. సినిమా అంతా ఫుల్ మాస్ మసాలాగా నడుస్తుందని టీజర్ తోనే అర్ధమవుతుంది. కార్తి సినిమాలు ఎలాగు తెలుగులో రిలీజ్ అవుతాయ్ కాబట్టి ఈ ఖైది కూడా తెలుగులో వస్తుందని చెప్పొచ్చు. మరి కార్తి ఖైది ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news