Gossipsకన్నీళ్లు పెట్టుకున్న ఫోర్న్ స్టార్ ! కారణం అతడే..

కన్నీళ్లు పెట్టుకున్న ఫోర్న్ స్టార్ ! కారణం అతడే..

ఫోర్న్ స్టార్ సన్నీలియోన్ ఎప్పుడు జనాల ముందుకు వచ్చినా ముఖంలో చిరు నవ్వులు చిందిస్తూ కనిపిస్తుంది. తన హాట్ హాట్ అందాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సన్నీలియోన్ ప్రస్తుతం ఫోర్న్ మూవీస్ కి బాయ్ బాయ్ చెప్పి బాలీవుడ్ లో స్థిరపడిపోయి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకునే పనిలో పడింది. తాజాగా ఆమెకు సంబందించిన ఓ అప్డేట్ అందరికి బాధ కలిగిస్తోంది.

తాజాగా ఆమె ఓ బుల్లితెర షో లో పాల్గొన్న సన్నీలియోన్ ఓ వ్యక్తి కారణంగా కన్నీళ్లు కార్చేసింది. ఇంతకీ విషయం ఏంటి అంటే తనతో పాటు పనిచేసిన ప్రభాకర్ అనే వ్యక్తి తీవ్ర అనారోగ్యంతో ఇటీవలే మరణించాడట. ఆ వార్త తెలియగానే సన్నీ లియోన్ షాక్ కి గురయ్యిందట. తన సహాయకుడిగా పనిచేసిన ప్రభాకర్ వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి అని అయితే అతని రెండు కిడ్నీలు చెడిపోవడంతో అతను తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని సన్నీ ఆవేదనగా చెప్పుకొచ్చింది.

ప్రభాకర్ పై ఆధారపడిన అతని భార్య, పిల్లలతో పాటు ముసలి తల్లి కూడా ఉందని , వారి పరిస్థితి ఏంటో అంటూ ఆమె ఆవేదనగా మాట్లాడింది. ప్రభాకర్ అనారోగ్యానికి గురయినప్పుడే అతన్ని బతికించేందుకు తీవ్రంగా ప్రయత్నించామని, తన భర్త డేనియల్ తో కలిసి ఫండ్ రైజ్ చేసేందుకు అన్నిరకాలుగా ప్రయత్నించామని కానీ చివరకు ఉపయోగం లేకుండా పోయిందని సన్నీ కన్నీరుమున్నీరుగా విలపించింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news