ఆ హిట్ డైరెక్టర్ కన్ను ఎన్టీఆర్ పై పడిందా ?

టాలీవుడ్ లో హిట్ సినిమా కొట్టిన ప్రతి డైరెక్టర్ తమ తదుపరి సినిమా యంగ్ ఎన్టీఆర్ తో చేయాలనీ చూస్తుంటారు. యంగ్ ఎన్టీఆర్ కి ఇండ్రస్ట్రీలో ఉన్న క్రేజ్ అటువంటిది. ఇక విషయానికి వస్తే నాచురల్ స్టార్ నాని హీరోగా విడుదలయిన జెర్సీ సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ప్రదర్శించబడుతున్న సంగతి తెలిసిందే. కలెక్షన్ల పరంగా చూసినా ఈ సినిమా టాప్ రేంజ్ లో ఉంది.

గత ఏడాది కాలంగా ఒక్క హిట్ కూడా దక్కించుకోలేక నిరాశలో ఉన్న నానికి ఈ సినిమా మంచి బూస్ట్ ఇచ్చింది. జెర్సీ సినిమా ఇంత హిట్ టాక్ తెచ్చుకోవడానికి కారణం ఆ సినిమా డైరక్టర్ గౌతమ్ తిన్ననూరి నే కారణం అని ఇప్పుడంతా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఈ సినిమా ను అల్లు అర్జున్, ఎన్టీఆర్ ప్రశంసించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఎన్టీఆర్ ఈ సినిమాను స్పెషల్ గా పొగడడం వెనుక పెద్ద కారణమే ఉందనే టాక్ ఇండ్రస్ట్రీ లో నడుస్తోంది.

ఎన్టీఆర్ కి గౌతమ్ తిన్ననూరి కి గతం నుంచే పరిచయం ఉందట. ఈ దర్శకుడు తారక్ కు జెర్సీ కంటే ముందే కథ చెప్పాడట. గౌతమ్ సెన్సిబిలిటీస్ నచ్చాయని, తారక్ ప్రశంసలు కురిపించాడని తెలుస్తుంది. అందుకే తారక్ సినిమా గురించి పోస్ట్ చేశాడని ఇండస్ట్రీ లో టాక్ నడుస్తోంది . అంతేకాకుండా ఈ సినిమా చూసిన తారక్ తనకు మంచి స్టోరీ రెడీ చేయమని డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి కి ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అంటే మరికొద్ది రోజుల్లో యంగ్ ఎన్టీఆర్ – జెర్సీ డైరెక్టర్ క్రేజీ కాంబినేషన్ లో సినిమా మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది.

Leave a comment