Gossipsఆర్ఆర్ఆర్ కి శ్రద్దా..నో.? షాక్ లో రాజమౌళి..

ఆర్ఆర్ఆర్ కి శ్రద్దా..నో.? షాక్ లో రాజమౌళి..

టాలీవుడ్ లో బాహుబలి తర్వాత ఆ తరహా భారీ ప్రతిష్టాత్మక సినిమా ఆర్ఆర్ఆర్ మూవీ తెరకెక్కిస్తున్నారు దర్శకధీరుడు రాజమౌళి. రాంచరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ మూవీగా వస్తున్న ఈ సినిమా లో 1920 నాటి పరిస్థితులకు అద్దం పట్టే విధంగా చూపించబోతున్నారు. అల్లూరి సీతారామరాజు, కొమురంభీమ్ ల పాత్రలతో ఈ మూవీ ఉండబోతుందట.

అయితే ఈ సినిమాలో హీరోయిన్లుగా బాలీవుడ్ బ్యూటీ ఆలియాభట్ , బ్రిటిష్ నటి డైసీ ఎడ్గర్ నటిస్తున్నట్లు చెప్పారు. కానీ ఈ మూవీ నుంచి బ్రిటిష్ నటి డైసీ ఎడ్గర్ తప్పుకుంది. దాంతో ఎన్టీఆర్ కి హీరోయిన్ వెతికేపనిలో ఉన్నారు చిత్ర యూనిట్.

ఈ నేపథ్యంలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్దాకపూర్ ని తీసుకుందామని ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇప్పటికే శ్రద్దా కపూర్ , ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ‘సాహూ’సినిమాలో నటిస్తుంది. అయితే ఆర్ఆర్ఆర్ మూవీలో నటించడానికి అందరూ ఓకే అనుకుంటారని భావిస్తున్న సమయంలో ఈ భామ పెద్ద షాక్ ఇచ్చింది.

ప్రస్తుతం తాను రెండు మూడు ప్రాజెక్ట్ లో కంటిన్యూగా నటిస్తున్నందున..డేట్స్ కూదరడం లేదని తేల్చి చెప్పినట్లు బాలీవుడ్ వర్గాల్లో అనుకుంటున్నట్లు సమాచారం. మరి రాజమౌళి ఏదైనా మ్యాజిక్ చేస్తారా..లేదా వేరే హీరోయిన్ ని సెలక్ట్ చేస్తారా చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news