నాని వ్యూహంలో చిక్కుకున్న సమంత..!

నాచురల్ స్టార్ నాని జెర్సీ పూర్తి కాగానే త్వరలోనే ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో ఓ సినిమా షురూ చేస్తున్నాడు. అష్టా చెమ్మ, జెంటిల్ మెన్ సినిమాల తర్వాత ఈ ఇద్దరు కలిసి చేస్తున్న హ్యాట్రిక్ మూవీగా ఈ సినిమాపై సూపర్ క్రేజ్ ఏర్పడింది. ఇక ఈ సినిమాలో సుధీర్ బాబు కూడా స్పెషల్ రోల్ చేస్తున్నాడు. నాని ఫుల్ లెంగ్త్ నెగటివ్ రోల్ గా చేస్తున్న ఈ సినిమాకు వ్యూహం అన్న టైటిల్ పరిశీళణలో ఉంది.

ఇక ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. నాని సమంత ఇద్దరు కలిసి ఈగ, ఎటో వెళ్లిపోయింది మనసు సినిమాల్లో నటించారు. ఇక ఈ సినిమాతో మరోసారి జతకట్టబోతున్నారు. పెళ్లి తర్వాత సమంత తన సినిమాల జోరుని కొనసాగిస్తుంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న సమంత తెలుగులో మజిలి, తమిళంలో సూపర్ డీలక్స్ సినిమాలతో అలరిస్తుంది.

మరి నాని, సమంత ఇద్దరు కలిసి చేసే ఈ మూవీ ఎలా ఉండబోతుందో చూడాలి. సస్పెన్స్ థ్రిల్లర్ గా రాబోతున్న వ్యూహం సినిమాతో ఇంద్రగంటి మోహనకృష్ణ ఎలాంటి ప్రయోగాన్ని చేస్తున్నాడో చూడాలి.

Leave a comment