పెళ్లికాకముందు తల్లి అయిన హాట్ బ్యూటీ..!

ఆ మద్య ఎవడు మూవీలో రాంచరణ్ సరసన నటించిన బాలీవుడ్ బ్యూటీ అమీ జాక్సన్ తన బిగి బిగి అందాలతో కుర్రాళ్ల మతులు పోగొట్టింది. తర్వాత శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా నటించిన ఐ చిత్రం..రజినీ నటించిన 2.0 చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న నటి అమీ జాక్సన్. ఈ అమ్మడు సినిమాలో కన్నా హాట్ హాట్ ఫోటో షూట్స్ తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది. తాజాగా అమీ జాక్సన్ తాను గర్భవతినని ప్రకటించింది.
1
మల్టీ మిలియనీర్ జార్జ్ పనాయిటౌతో డేటింగ్ చేస్తున్న అమీ జాక్సన్ త్వరలోనే తన తొలి బిడ్డకు జన్మనివ్వబోతున్నది. ఈ మధ్యే జార్జ్‌తో ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది. జార్జ్‌తో కలిసి ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ తాను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని తెలిపింది. కొంత కాలంగా బ్రిటన్ కి చెందిన కుభేరుడు జార్జ్‌తో అమీజాక్సన్ డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే..ఈ జంట చట్టాపట్టాలేసుకొని ఉన్న ఫోటోలు ఎన్నో తన ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేసింది అమీ జాక్సన్.
2
బ్రిటన్‌ లో హిల్టన్, పార్క్ ప్లాజా, డబుల్ ట్రీలాంటి లగ్జరీ హోటల్స్‌ను అతడు నిర్వహిస్తున్నాడు. మద్రాస్ పట్టణం మూవీతో హీరోయిన్ గా పరిచయం అయిన అమీ జాక్సన్ హిందీ, తెలుగు సినిమాల్లోనూ నటించింది. బాలీవుడ్‌లో అక్షయ్ సరసన సింగ్ ఈజ్ బ్లింగ్, నవాజుద్దీన్‌తో కలిసి ఫ్రీకీ అలీ సినిమాల్లో నటించింది. అమీ నటించిన కిక్ 2 మూవీ విడుదలకు సిద్ధమవుతున్నది.
3

Leave a comment