‘జెర్సీ’పై నానీ క్లారిటీ!

Latest update on nani jersey

భలే భలే మగాడివోయ్ సినిమా తర్వాత నేచురల్ స్టార్ నాని వరుస విజయాలు అందుకుంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నాని ‘జెర్సీ’సినిమాలో నటిస్తున్నాడు. ఇక ‘జెర్సీ’ ఒక బయోపిక్ అనే వార్త ప్రచారం లో ఉంది. ఈ సినిమా మాజీ ఇండియన్ క్రికెటర్ రమణ్ లాంబా జీవితం ఆధారంగా తెరకెక్కుతోందని ఆ వార్త సారాంశం. రమణ్ లాంబా ఢాకా లో ఒక లీగ్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో బాల్ కణతకు తగలడంతో ప్రాణాలు కోల్పోయాడు.

రమణ్ కూడా ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకోవడం మళ్ళీ ముప్పై నాలుగు.. ముప్పై ఐదు ఏళ్ళ వయసులో క్రికెట్ ను టేకప్ చేయడం జరిగింది. జెర్సీ స్టొరీలైన్ కు రమణ్ జీవితానికి దగ్గర పొలికలు ఉండడంతో ఇలా ప్రచారం సాగుతోంది. కాకపోతే ఈ విషయం పై గత కొంత కాలంగా చర్చలు నడుస్తూనే ఉన్నాయి..ఇది నిజమా కాదా అనే విషయంపై ‘జెర్సీ’ టీమ్ లో ఎవరూ స్పందించలేదు. ఆ మద్య దర్శకుడు గౌతమ్ తిన్ననూరి రాసిన కల్పితమైన కథ అని క్లారిటీ ఇచ్చాడు.

ఇదే విషయం హీరో నానిని ప్రశ్నిస్తే ‘జెర్సీ’ రమణ్ లాంబా జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా కాదని ఫైనల్ గా క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమాలో నాని పోషిస్తున్న అర్జున్ పాత్ర క్లైమాక్స్ లో చనిపోతుందనే టాక్ ఉంది. అయితే ఈ మూవిలో మరో ట్విస్ట్ ఏంటంటే.. రెండు క్లైమాక్సులను షూట్ చేసిపెట్టారని గతంలో ప్రచారం సాగింది. ఒకటి విషాదాంతం కాగా మరొకటి సుఖాంతం.. ఫైనల్ గా ఒక వెర్షన్ ఉంచుతారని కూడా అన్నారు.

Leave a comment