నేను డబ్బుకి కక్కుర్తి పడే టైపు కాదు.. ఆ షో చూడను ఇంకా జడ్జ్ ఎలా చేస్తాను..!

తెలుగు బుల్లితెర మీద నవ్వుల జల్లు కురిపిస్తున్న జబర్దస్త్ షోకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో అంతమంది యాంటీ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ముఖ్యంగా అందులో వారు చేసే కామెడీకి సెన్సార్ ఉండదు. కొన్నిసార్లు అవి వివాదాస్పదంగా మారిన సందర్భాలు ఉన్నాయి. ఇదిలాఉంటే ఎన్నికల టైంలో రోజా, నాగబాబు ఇద్దరు పోటీకి దిగారని తెలిసిందే. రోజా వైసిపి నుండి ఎమ్మెల్యే అభ్యర్ధిగా బరిలో దిగగా.. నాగబాబు జనసేన తరపున ఎంపిగా పోటీ చేశారు.

ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న వీరికి జబర్దస్త్ షాక్ ఇచ్చింది. వీళ్ల బదులుగా మరో ఇద్దరిని జబర్దస్త్ లో తీసుకోవాలని నిర్ణయించారు. అనుకున్నట్టుగానే నాగబాబు బదులుగా శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ ఎపిసోడ్ కు ఒకరు వస్తుండగా.. రోజా బదుకుగా మీనా రీప్లేస్ చేసింది. రోజాకు సరిసమానంగా ఇమేజ్ ఉన్న మీనా జబర్దస్త్ షోలో పాల్గొనడం బుల్లుతెర ఆడియెన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చింది. అయితే మీనా కన్నా ముందు ఈ ఛాన్స్ సీనియర్ నటి జయసుధ దగ్గరకు వెళ్లిందట.

అలాంటి వల్గర్ షోకి తాను హోస్ట్ గా ఉండలేనని చెప్పిందట జయసుధ. రెమ్యునరేషన్ భారీగా ఇస్తామని నిర్వాహకులు చెప్పినా డబ్బు కోసం కక్కుర్తి పడే టైప్ తాను కాదు అన్నట్టుగా ఆమె ఈ ఛాన్స్ ను తిప్పికొట్టింది. ఇదిలాఉంటే నాగబాబు మాత్రం ఎంపిగా తాను గెలిచినా ఓడినా జబర్దస్త్ మాత్రం వదిలిపెట్టనని ట్విస్ట్ ఇచ్చాడు. రోజా మాత్రం ఇక మళ్లీ జబర్దస్త్ కు రావడం కష్టమని టాక్.

Leave a comment