నితిన్ భీష్మలో చిత్రలహరి భామకు ఛాన్స్..!

మళయాళ గ్రేట్ డైరక్టర్ ప్రియదర్శన్ కూతురు కళ్యాణి ప్రియదర్శన్. అఖిల్ హలో సినిమాలో అలరించిన ఈ అమ్మడు రీసెంట్ గా సాయి తేజ్ చిత్రలహరి సినిమాలో కూడా నటించింది. హలో రిజల్ట్ తేడా కొట్టినా చిత్రలహరి మాత్రం ఆమెకు హిట్ ఇచ్చింది. ముఖ్యంగా సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్ క్యూట్ లుక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. చిత్రలహరి హిట్ ఆమె కెరియర్ కు మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. అందుకే నితిన్ సినిమాలో కూడా లక్కీ ఛాన్స్ అందుకుంది.

ఛలో సినిమాతో సత్తా చాటిన వెంకీ కుడుముల డైరక్షన్ లో నితిన్ హీరోగా వస్తున్న సినిమా భీష్మ. ఈ సినిమాలో రష్మిక మందన్న ఒక హీరోయిన్ కాగా సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కళ్యాణి ప్రియదర్శన్ ఛాన్స్ దక్కించుకుందట. సెకండ్ హీరోయిన్ అయినా సరే సినిమాలో ఆమె పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందట. ప్రస్తుతం యూత్ లో రష్మిక క్రేజ్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమెతో పాటుగా కళ్యాణి కూడా చేరడంతో నితిన్ భీష్మపై అంచనాలు పెరిగాయి.

రీసెంట్ గా రిలీజ్ చేసిన భీష్మ టైటిల్ పోస్టర్ కూడా వెరైటీగా అనిపించింది. తప్పకుండా నితిన్ కు భీష్మ కొత్త క్రేజ్ తెచ్చిపెడుతుందని అంటున్నారు. యువ హీరోలంతా డిఫరెంట్ స్టోరీస్ తో దూసుకెళ్తుంటే నితిన్ ఈమధ్య రెగ్యులర్ పంథా కొనసాగించాడు. అందుకే ఇప్పుడు భీషంతో సత్తా చాటాలని చూస్తున్నాడు నితిన్. మరి ఆ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.

Leave a comment