రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ కు షాక్ ఇచ్చిన ప్రభాస్ హీరోయిన్..!

ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి చేస్తున్న భారీ మల్టీస్టారర్ మూవీ ఆర్.ఆర్.ఆర్. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుందని తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్స్ గా అలియా భట్, డైసీ ఎడ్గర్ జోన్స్ నటిస్తారని ఎనౌన్స్ చేశాడు రాజమౌళి. అలియా భట్ అయితే ఓకే కాని డైసీ ఎడ్గర్ జోన్స్ మాత్రం సినిమాలో నటించట్లేదని తెలిసిందే.

అయితే ఆమె స్థానంలో హీరోయిన్ కోసమే ఇప్పుడు వేట మొదలుపెట్టారు. డైసీ ను నిత్యా మీనన్ రీప్లేస్ చేస్తుందని అన్నారు. ఆ వార్త్రల్లో నిజం లేదని తెలుస్తుంది. ఇక లేటెస్ట్ గా సాహోతో సౌత్ ఇండస్ట్రీకి వస్తున్న శ్రద్ధా కపూర్ ను ఆర్.ఆర్.ఆర్ కోసం అడిగారట. రాజమౌళి సినిమా అంటే ఎలా లేదన్నా రెండేళ్లు డేట్స్ ఇవ్వాల్సిందే అందుకే శ్రద్ధా కపూర్ కూడా ఆర్.ఆర్.ఆర్ కు నో చెప్పిందని తెలుస్తుంది.

సాహోలో ప్రభాస్ తో జత కడుతున్న శ్రద్ధా కపూర్ ఆర్.ఆర్.ఆర్ కూడా చేస్తే బాగుండేది. కాని ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ కు అంతరాయాలు చూసి ఆమె సినిమా చేయకూడదని నిర్ణయానికి వచ్చిందట. అంతేకాదు తనకు బాలీవుడ్ లో కూడా అవకాశాలు వస్తున్నాయి. డేట్స్ అడ్జెస్ట్ చేయలేకే ఆర్.ఆర్.ఆర్ ఛాన్స్ వచ్చినా సారీ చెప్పక తప్పలేదట. మరి ఆ లక్కీ ఛాన్స్ ఎవరు అందుకుంటారో చూడాలి.

Leave a comment