బిగ్ బాస్ హోస్ట్ గా అనుష్క..?

బిగ్ బాస్ సీజన్ 3 హోస్ట్ ఎవరు ఇప్పుడు సోషల్ మీడియాలో మిలియన్ డాలర్ల ప్రశ్న అంటూ ఉంటే అది ఇదే. బిగ్ బాస్ సీజన్ 1 ఎన్.టి.ఆర్, సీజన్ 2 నాని హోస్ట్ గా చేయగా త్వరలో మొదలు కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 3 హోస్ట్ గా ఎవరు చేస్తారన్న కన్ ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంది. ఈసారి కూడా ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేస్తాడని వార్తలు మొదలై ఎన్.టి.ఆర్ కాదు నాగార్జున, వెంకటేష్, విజయ్ దేవరకొండ ఇలా అందరి పేర్లు వచ్చేశాయి.

ఇదిలాఉంటే లేటెస్ట్ గా ఈసారి బిగ్ బాస్ తెలుగు హోస్ట్ గా చేసేది హీరో కాదు హీరోయిన్ అని అంటున్నారు. స్వీటీ అనుష్క బిగ్ బాస్ హోస్ట్ గా చేస్తుందని టాక్. స్టార్ మా ఇప్పటికే ఆమెను సంప్రదించడం జరిగిందట. బుల్లితెర మీద ప్రెస్టిజియస్ షో అయిన బిగ్ బాస్ ను అనుష్క లాంటి హీరోయిన్ హ్యాండిల్ చేయగలడా అన్నది ప్రశ్నార్ధమకమే. బిగ్ బాస్ హోస్ట్ గా అనుష్క జస్ట్ రూమరే అంటున్నారు కొందరు.

మరి ఈ హోస్ట్ ఎవరన్నది తెలియదు కాని బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టంట్స్ లిస్ట్ మాత్రం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్.టి.ఆర్ ఎలాగు ఆర్.ఆర్.ఆర్ లో నటిస్తున్నాడు కాబట్టి అతను చేసే ఛాన్స్ లేదు. నాగ్ కూడా మన్మథుడు 2తో బిజీ ఇంతకీ బిగ్ బాస్ 3 హోస్ట్ ఎవరో తెలియాలంటే మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

Leave a comment