విలన్ గా నాని..షాక్ లో ఫ్యాన్స్..

ఈ మద్య టాలీవుడ్ హీరోలు రోటీన్ కి భిన్నంగా నటించాలనే తాపత్రయంలోఉన్నారు. ఒకప్పుడు హీరోలుగా నటించిన వారు ప్రస్తుతం విలన్ పాత్రల్లో నటించి మెప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోకొంత మంది యంగ్ హీరోలు కూడా విలన్ అవతారం ఎత్తాలని చూస్తున్నారు. ఆ మద్య టెంపర్ సినిమాలో ఎన్టీఆర్ ఇంట్రవెల్ వరకు నెగిటీవ్ షేడ్స్ లో కనిపిస్తాడు. ఇలా తెలుగు, తమిళ హీరోలు విలన్ రోల్స్ లో నటించడానికి ఉత్సాహం చూపిస్తున్నారు.

తాజాగా అష్టాచమ్మ సినిమాతో హీరోగా కెరీర్ ప్రారంభించిన నాని ఈ మద్య వరుస విజయాలు అందుకుంటూ స్టార్ హీరోగా మారారు. ప్రస్తుతం నాని నటించిన జర్సీ విడుదలకు సిద్దంగా ఉంది. ఇక మనం ఫేమ్ విక్రమ్ కుమార్ తో ఓ సినిమాలో నటిస్తున్నాడు.

ఈ మూవీ పూర్తి కాగానా ఇంద్రగంటి తెర‌కెక్కించ‌నున్న చిత్రం మ‌ల్టీ స్టార‌ర్ మూవీగా రూపొంద‌నుండ‌గా ఇందులో సుధీర్ బాబు కూడా మ‌రో ప్ర‌ధాన పాత్ర పోషిస్తాడ‌ట‌. ఈ సినిమాలో నాని స‌ర‌స‌న అదితిరావుని ఎంపిక చేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది. తాజాగా ఈ మూవీలో సంబంధించి మ‌రో ప్ర‌చారం జ‌రుగుతుంది. సుధీర్ బాబు పోలీస్ అధికారి పాత్ర‌లో క‌నిపించ‌నుండ‌గా, నాని ప్ర‌తి నాయ‌క పాత్ర‌లో న‌టించ‌నున్నాడ‌ట‌. నాని పాత్ర పూర్తిస్థాయి నెగెటివ్ షేడ్స్ లో ఉండబోతుందట..కథా పరంగా ఆ క్యారెక్టర్ కి మంచి బలం ఉండటంతో నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. మరి ఇది ఎంత వరకు నిజమో ముందు ముందు తెలుస్తుంది.

Leave a comment